Friday Abhishekam Seva


*Every Friday SSSVD temple has Sri Varu Abhishekam @7:30am. In this Seva, Srivaru can be witnessed in Abhisheka Vastram🪔* *Please visit at least one Friday to see the Abhishekam and feel the Divinity* Every Friday after Suprabhatha Seva, the regular Thomala and Archana Sevas are done in privacy and then Srivari Abhishekam is observed. This happens to be the most ancient Arjitha Seva that is being observed for Moola Virat of Lord Venkateswara along with Bhoga Srinivasa Murthy The Abhishekam starts with Sacred water, then with COW Milk, Curd, then with Suddhodakam, Chandanam and other scented articles like powdered Pachcha Karpooram, Saffron paste and drops of Navaratna oil etc., which are brought earlier in the silver vessels. While performing the Abhishekam to the Moola Virat and Bhoga Srinivasa Murthy,Purshasukta, Narayanasukta, Srisukta, Bhusuktha, Neelasuktha and selected Pasurams from the Divya Pradbandham are all recited by the priests. Later, the Abhishekam is performed for the image of Goddess Lakshmi on his chest with Turmeric Paste. *The Arjitha Grihastas (Sponsors)who take part in this seva, will be given Green Coconut to hand over to Priest at Srivaru Antharalayam* *After completion of Abhishekam, priest will Sprinkle the Abhisekam water (Holy water) on the Devotees to cleanse our Aura and followed by Theertham and Prasadam* *Request you to witness this amazing Seva at least once and feel the experience*

ప్రతీ శుక్రవారం SSSVD గుళ్లో ఉదయం 7.30 శ్రీవారి సేవల్లో జరిగే అభిషేకం, అభిషేక వస్త్రం శ్రీవారికి జరిగే సేవల్లో చెప్పుకోదగ్గ ఘనమైన సేవ. వీలైతే ప్రతీ భక్తుడు ఒక్కసారైనా చూసే భాగ్యం మాటల్లో వర్ణించలేని నయనానంద కరమైన దృశ్యం ప్రతీ శుక్రవారం సుప్రభాత సేవ , యధావిధిగా జరిగే తోమాల మరియు అర్చన సేవల తరువాత జరిగే శ్రీవారికి జరిగే అభిషేకమే ముఖ్యఘట్టం. ఈ సేవ ఎంతో పురాతనమైనది, ఈ సేవ మూల విరాట్టు అయిన శ్రీవారి తో పాటు భోగ శ్రీనివాసులుకు కూడా కలిపిచేసే సేవ. శ్రీవారి అభిషేకం పవిత్రమైన జలంతో ప్రారంభించి తరువాత ఆవుపాలు, పెరుగు, పళ్ళ రసాలు మరియు కర్పూర చందనాదులతో, అగోరోత్తుల పరిమళాళలతో , సువాసనలు వెదజల్లే నవమూలికల నూనె తో కూడిన కుంకుమ పువ్వుల ముద్దను వెండి గిన్నెలలో తీసుకొచ్చి స్వామివారి అభిషేక సేవలో ఉపయోగించే ప్రక్రియ మాటల్లో వర్ణించలేని అనుభూతి. మూలవిరాట్టు అయిన శ్రీవారికి మరియు భోగ మూర్తులకు అభిషేకం జరుగుతున్నప్పుడు పూజారులు పారాయణ చేసే పురుష సూక్తం, నారాయణ సూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలసూక్తం, దివ్య ప్రబంధం నుండి గ్రహించిన పాసురాలు తో జరిగే అభిషేకాన్ని చూడటం అనేది కేవలం పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. ఈ అభిషేక ప్రక్రియలో భాగంగానే శ్రీవారి హృదయస్థానమందుండే శ్రీ మహాలక్ష్మీ రూపును పసుపు ముద్దతో అలంకరిస్తారు. ఎవరైతే ఈ శ్రీవారి అభిషేక ఆర్జిత సేవలో పాల్గొంటారో వారి చేతులమీదుగా కొబ్బరిబోండంను అంతరాలయంలో ఉన్న పూజారికి అందచేస్తారు. ఈ అభిషేక ప్రక్రియ పూర్తైన తరువాత అక్కడి పూజారి స్వామివారికి అభిషేకించబడిన పవిత్ర జలాన్ని అక్కడికి వచ్చిన భక్తుల పై చల్లి వారిని శుద్ధి చేస్తారు. ఆ పవిత్ర జలంతో అక్కడి వాతావరణం శుద్ధి చేయబడుతుంది, అటుపై వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసాదాలు తీసుకున్న భక్తులు స్వామి కృపకు పాత్రులవుతారు. చివరిగా విన్నపం : ప్రతీ ఒక్క భక్తుడు స్వామివారికి జరిగే దివ్యమైన ఈ అభిషేక మహోత్సవాన్ని తిలకించి తరిస్తారని ఆశిస్తున్నాను