About Tirumala


తిరుమల 7 కొండలు

 

తిరుమల 7 కొండలు..పరమార్ధం

తిరుమల 7 కొండలు..

1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.

ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది.

అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

1. వృషభాద్రి - అంటే ఎద్దు.

వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)

వాక్కు అంటే - శబ్దం

శబ్దం అంటే - వేదం

వేదం అంటే - ప్రమాణము

నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజం గా దాని కన్నా అభద్దం ఉంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్ట లేదా. కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి - అంటే ధర్మం

ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు.

అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.

3. గరుడాద్రి - అంటే పక్షి 

ఉపనిషత్తుల జ్ఞా నాన్ని పొందడం. షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడు భగవానుడు. భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు. అన్ == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.

అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక.

కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి.

కంటికి అందం ఎప్పుడు? - ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.

అప్పుడు అంజనాద్రి దాటతాడు.

5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు.

తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు)

తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. (ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణలు గురుంచి చెప్పారు ) ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.

ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థ ని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారయానాద్రి.

వేంకటాచలం లో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం 7 కొండలు ఎక్కడం

🙏సర్వేజనా సుఖినోభావంత్🙏

శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం

🙏శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం🙏🌼🌿

🌿🌼🙏ఈ భూమండలంలో ఎక్కడ కనిపించని లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం .శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎందుకు ఉంటుంది, మహ అద్భుతమైన శ్రీవేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడాని గల కారణం 🙏🌼🌿

🌿🌼🙏 పద్మావతీ వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడు. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడు. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలందుకుంటున్నాయి🙏🌼🌿

🌿🌼🙏ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వేంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీరామానుజాచార్య, శ్రీ కులశేఖరాళ్వారులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అర్చావతారుడై వెలసి ఉన్నాడు🙏🌼🌿

🌿🌼🙏వేంకటాద్రి సమమ్ స్థానమ్ బ్రహ్మాండే నాస్తి కించన |వెంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి || అని కంఠోక్తిగా చెప్పబడింది🙏🌼🌿

🌿🌼🙏అనగా వేంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం, ఈ బ్రహ్మండమంతటిలోనూ మరొకటి లేదు. అంటే బ్రహ్మాండం అంతటిలోనూ మహోత్తమమైన దివ్యక్షేత్రం శ్రీ వేంకటాచల క్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వరునితో సరితూగగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు. ఇకముందు భవిష్యత్తులో ఉండబోరు. భూత, భవిష్యత్, వర్తమానాలలో సరిసాటిలేని పరమదైవం శ్రీ వేంకటేశ్వరుడు. అలాంటి శేషాద్రివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎందుకు ఏర్పడిందనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే🙏🌼🌿

🌿🌼🙏పరమదైవమైన శ్రీ వేంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుని ప్రీత్యర్థంగా, ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది. నవ (తొమ్మిది) సంఖ్యకు- బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి. ముందురోజున జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, చివరోజున జరిగే శ్రీ పుష్పయాగం- ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని, ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం🙏🌼🌿

🌿🌼🙏ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వేంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికా గ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం జరుపబడతాయి. అదే రోజున ప్రప్రథమంగా శ్రీ వేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విష్వక్సేన భగవానుని యథావిధిగా పూజిస్తారు. విష్వక్సేనుల వారిని చతుర్వీథుల ఉత్సవం పేరిట ఊరేగించి, తీసుకుని వస్తారు. విష్వక్సేనుడు దేవాలయానికి తిరిగివచ్చిన తర్వాత యాగశాలలో, మృత్తికా గ్రహణం అంకురారోపణం చేస్తారు🙏🌼🌿

🌿🌼🙏అలాగే ధ్వజరోహణం ఎలా చేస్తారంటే.. ఒక దృఢమైన నూతన వస్త్రంపైన శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని లిఖిస్తారు. ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపైన ఎగురవేస్తారు అర్చకులు. దీనినే ధ్వజారోహణం అంటారు. గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వేంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాలోని సకల దేవతా గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ సమయంలో వేదపండితులు మంత్రపఠనం చేస్తారు. ఆ విధంగా శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి🙏🌼🌿

🌿🌼🙏శ్రీవారి వజ్రం🙏🌼🌿

🌿🌼🙏శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12 కిలోల బరువుతో కూడుకున్నది. దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట. ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు. దీనివిలువ మాత్రమే రూ. లక్ష కోట్లు🙏🌼🌿

🌿🌼🙏రాజేంద్ర చోళుడు, కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా నిరాయుధపాణిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు🙏🌼🌿

🌿🌼🙏శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట....!🙏🌼🌿

🌿🌼🙏శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా? స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది. తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశము🙏🌼🌿

🌿🌼🙏తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు🙏🌼🌿

🌿🌼🙏శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు🙏🌼🌿

🌿🌼🙏అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు🙏🌼🌿

🌿🌼🙏ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే.. స్వామివారికి ధరించే పీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు🙏🌼🌿

🌿🌼🙏తిరుమల సుప్రభాత సేవ 🙏🌼🌿

🌿🌼🙏తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రతిదినం సుప్రభాతం' అనబడే 'మేలుకొలుపు' సేవ తో ఆ రోజు నిర్వహించబోయే పూజా కార్యక్రమం ప్రారంభమై బంగారు వాకిలి ద్వారములు తెరుస్తారు🙏🌼🌿

🌿🌼🙏తిరుమల లో ప్రతిరోజు నేటికి ప్రప్రధమంగా శ్రీ వారి దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి 'సన్నిధి గొల్ల'. ఆదిలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చే మొదటి దర్శన భాగ్యాన్ని వరం గా పొందిన ఆనాటి గోపాలకుని (యాదవుని) సంతతికి చెందిన వ్యక్తే ఈ గొల్ల. తిరుమల స్వామి వారి సన్నిధి సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి 'సన్నిధి గొల్ల' అని అంటారు. ప్రతి దినం బ్రాహ్మ ముహూర్తంలో (తెల్లవారు జామున 2-30 నుండి 3-00 గంటల ప్రాంతం లో) సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గొవింద నామాన్ని పఠిస్తూ దివిటీ (కాగడ) పట్టుకొని తిరుమల ఉత్తర మాఢావీధి లో ని శ్రీవారి నిత్యసేవా కైంకర్యపరులైన శ్రీ వైఖానస అర్చకుల తిరుమాళిగ (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాములను ఆలయానికి ఆహ్వానిస్తాడు🙏🌼🌿

🌿🌼🙏శ్రీవారి అర్చకులు శుచిస్నాతులై, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలను(12 నామాలు) ధరించి, సంధ్యానుష్టానాదులు పూర్తి చేసి ఆలయానికి బయలుదేరుతారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున వున్న చిన్న మంటపం(నగారా మంటపం లేదా నౌబత్ ఖానా) లో అర్చకుల రాకను తేలియజేయడానికన్నట్టు పెద్ద పలక గంటను మోగిస్తారు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారువాకిలి వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరువడానికి సిద్ధంగా వుంటారు🙏🌼🌿

🌿🌼🙏ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులను 'వైకుంఠం క్యూ' ద్వార ఆలయం లోనికి అనుమతిస్తారు. వీరంతా బంగారువాకిలి ముందు దక్షిణం వైపు పురుషులు - ఉత్తరం వైపు స్త్రీలు వరుసగా నిలిచి వుంటారు🙏🌼🌿

🌿🌼🙏ఇలా అందరూ సిద్ధంగా వుండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర,వెన్న, తాంబూలం గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వీరితో పాటుగా తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు అన్నమయ్య కీర్తననొకదానిని ఆలపిస్తూవుండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పు పై పవళించి వున్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధి లో శ్రీవారికి మొట్టమొదటి నివేదనగా పాలు (పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డం పై పచ్చకర్పూరపు చుక్క ని అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచ పాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్థం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు, మొదలైన వార్లు, భక్తులు లోనికి వచ్చి శ్రీవారి ని విశ్వరూప దర్శనం చేసుకుంటారు🙏🌼🌿

🌿🌼🙏 సుప్రభాత సేవ ఆర్జిత సేవ అనగా నిర్ణీత రుసుము చెల్లించి భక్తులు సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవ కు రుసుము రూ.120-00. సుమారు 1 సంవత్సరం ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేస్కోవచ్చు. సిఫార్సు లేఖల ద్వార ఒక రోజు ముందుగా కూడా ఈ సేవ టికెట్లు పొందవచ్చు. ఈ సిఫార్సు లేఖలను తిరుమల జే.ఈ.ఓ వారి క్యాంపు కార్యాలయంలో సమర్పించి టిక్కెట్లు పొందవచ్చు. ఈ విధంగా ఖరీదు చేసే టిక్కెట్టు వెల 240-00 వుంటుంది. సంవత్సరంలో ఒక్క మార్గశిర (డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు) మాసంలో మాత్రం ఈ సేవను నిర్వహించరు. సుప్రభాతం స్థానంలో ధనుర్మాసం 30 రోజుల పాటు 'తిరుప్పావై' (గోదాదేవి రచించిన భక్తి పాటలు) పఠిస్తారు. ఈ తిరుప్పావై ఆర్జిత సేవ కాదు, ఏకాంతంగా నిర్వహిస్తారు🙏🌼🌿

శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం

🌿🌼🙏శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం🙏🌼🌿

🌿🌼🙏మార్కండేయ ఉవాచ🙏🌼🌿

నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం

ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ

 

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు

ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః

 

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు

దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః

 

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః

పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు

 

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః

సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః

 

ఇతి శ్రీ వెంకటేస్వర వజ్ర కవచ స్తోత్రం సంపూర్ణం 🙏🌼🌿

“ వినా వేంకటేశం ననాథో న నాథ: సదావేంకటేశం స్మరామి స్మరామి !!”

పెళ్లి విందు తయారీ :

🛎 పెళ్లి విందు తయారీ :

👉 స్వామివారి కల్యాణం చదివితే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాలలో కల్యాణం చెయ్యడమెంత కష్టమో తెలుస్తుంది. 🌷🌷🌷

👉 కుబేరుడు నుండి అప్పు దొరికి, అన్నీ పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు , వచ్చేవాడు మనఇంటికి భోజనానికి లేక వస్తాడా? ఇప్పటి కిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు? అనుకున్నారు. స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే “ నేను చేస్తాను స్వామి! ” అన్నాడు. కానీ వంటపాత్ర సామానులేవి? అన్నాడు అగ్నిదేవుడు.

👉 అగ్నిదేవుడు, వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.

👉నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.

👉అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి. కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు.

👉ఒక్కో తీర్ధంలో / సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు.

👉స్వామి పుష్కరిణిలో @ అన్నం,

👉పాపనాశనంలో @ పప్పు,

👉ఆకాశగంగలో @ బెల్లం పరమాన్నం,

👉 దేవతీర్థంలో @ కూరలు,

👉తుంబురతీర్ధంలో @ పులిహోర,

👉కుమార తీర్ధంలో @ భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి),

👉పాండుతీర్ధంలో @ పులుసు,

👉ఇతర తీర్ధాల్లో @ లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు.

👉అలన్నిటిలోనూ పప్పులు, పులుసులు, చక్కెర పొంగళ్లు, కట్టు పొంగళ్లు, జీలకర్ర పొంగళ్లు, ఎన్నో రకాల పొంగళ్ళు, పులిహోర పొంగళ్ళు చేసారు. వడ్డన చేయాలి కూర్చోమని అన్నారు .

👉భోజనాల బంతులు వేంకటాచలం నుండి శ్రీశైలంవరకు వేశారు.

👉భోజనాలు సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు.

👉"నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరీకి వడ్డన. "నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.

👉ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు. 👉 (తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిపిస్తాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి.

👉ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడు, నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లికార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు.

👉అతిధులందరినీ చక్కగా కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణంగా కొద్ది రూరంలో ఉంది. ఇప్పటికీ చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) వేశాక అందరికి ఒకేసారి వడ్డించారు. 🛎 భోజనాలు వడ్డన :

👉ముందు విస్తళ్ళపై నీరు చల్లి, తుడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు. వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరిని ఉన్నంతలో ఏర్పాట్లు చేసాను, లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నాడు.

👉అందరి భోజనాలు ముగిశాకా, అందరికి దక్షిణతాంబూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం.

👉అందరూ భోజనాలు చేసి, బ్రేవుమని త్రేన్చి కూర్చున్నారు. అందరినీ భోజనమైందా అని పేరు పేరునా అడిగిన తరువాత శ్రీనివాసుడు, వకులమాత, మన్మథుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భొజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది.

👉అందరి భోజనాలు పూర్తయ్యాక, రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగ పెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది!

🙏గోవిందా గోవిందా 🙏

శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు

🕉 తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి..?? ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..??

👉 1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు.

👉 అపట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడా రామానుజా కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ కూడా జరిగినా ఆలయంలో పంచి పెట్టె ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం.

👉 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. " THOMOS MUNRO " ..

👉 దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఎలుబడి కింద ఉండేది.

👉 ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు... మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు..

👉 ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా...ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు.

👉 అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు( అవే వారికి భోజనాలు ).. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా , దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు. (అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు.) ఆ ప్రసాదాలను భక్త్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది... స్వతహాగా విదేశీయుడు కావున... అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని , శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని....

👉మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు..

👉 శ్రీవారి లీల ప్రభావంతో ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో...అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి , పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు.

👉 అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు దన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు.

👉 అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తన కి, సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల ,ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో..శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది..

👉తప్పు తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం చాలా గంగాళాలు సమర్పించాడు మరియూ తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు......

👉 ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు. మనోవ్యధ తో మంచం పట్టి నేరుగా ని సేవలో పాల్గొని అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827 లో ప్రాణం వదిలాడు.

👉 అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు... ఈ గంగాళలను ఇప్పటికీ " మన్రో గంగాళాలు " అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాల లో చలామణీలో ఉన్నాయి... శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి ప్రసాదించాడు. 👉 తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాల లోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారు లీలలు, చరిత్ర కలదు. భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున, ప్రతి గడప కి, ప్రతి చెట్టు కి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది... శ్రీనివాసుడి గురించి తెలుసుకోండి ..నలుగురికి తెలియజెప్పండి..

🙏 ఓం నమో వెంకటేశాయ 🙏

మన తిరుమల తిరుపతి

1.తిరుమల పూర్వ నామధేయమేమిటి? 

Ans.: వరహాపర్వతం.

2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? *

Ans. : ఉగ్రాణం. 

3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?

Ans. : నడిమిపడికావాలి.

4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? *

Ans.: పరిమళపు అర. *

5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?

Ans.: పోటు. 

6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?

Ans. : 30 అడుగులు. 

7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?

Ans.: అంగప్రదక్షణ. 

8. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?

Ans.: మహామణిమండపం. 

9. బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు?

Ans.: కొలువు మండపం.

10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?

Ans. : శయన మండపం.

11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?

Ans.: అద్దాల మండపం. 

12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి? 

Ans.: డోలా మండపం.

13. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?

Ans. : రంగనాయకుల మండపం.

14. తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది?

Ans.: రాజా తొదరమల్లు.

15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?

Ans.: బలి పీఠం.

16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?

Ans. : కోయిల్ తిరుమంజనం.

17. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?

Ans. : 4 సార్లు.

18. విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?

Ans.: 2 సార్లు *

19. సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?

Ans. : 29

20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?

Ans. : 7 సార్లు

ఓం నమో వెంకటేశాయ

🙏🏼వెంకటేశా🙏🏼

గోవింద నామం

శ్రీనివాసుడికి * గోవింద * నామం ఎలా వచ్చింది...?
 
గోవు...!..ఇందా.. ! [గోవు + ఇందా = గోవిందా] !*
 
కలౌ వేంకట నాయక: అన్నట్లు , కలి యుగానికి ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి . నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ప్రమాణంగల కలి యుగానికి ఆదిదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ యుగాది నందే, తానుండవలసిన చోటు "సప్తగిరి "అని ఎంచుకొని , తిరుపతి ప్రాంతానికి వచ్చాడట ! అప్పుడు అక్కడ చిర కాలంగా ఆశ్రమం ఏర్పరచుకొని , తపస్సు చేసుకుంటూ ఉన్న అగస్త్య మహర్షిని చూచి , ముని పుంగవా! నేను వేంకట నాయకుణ్ణి . ఈ కలియుగానికి అధిపతిని. అందరికీ ఆరాధ్య దైవాన్ని. ఈ "సప్తగిరి "మీద నివసిద్దామని వచ్చాను .రోజూ క్షీర సేవనం చెయ్యడానికి నాకు ఒక గోవునిస్తావా? అని అడిగాడు . ఋషి ఆ మాటలు విని పులకించి పోయాడు . "ఓహో ! ఏమి నా భాగ్యం ? సాక్షాత్తూ వేకటేశ్వర స్వామియే వచ్చి ,నన్ను గోవునిమ్మని అడగ వచ్చాడా ?" అని ఆనందిస్తూ . అప్పుడాశ్రమంలో ఉన్న గోవులు మేతకై అడవిలోకి వెళ్ళడం చేత , అగస్త్యుడు చేతులు మోడ్చి , "స్వామీ !అలాగే ! నీకు గోవును తప్పకుండా ఇస్తాను. నీవు నివసించే స్థలం " ఫలానా "అని ఎంచుకున్నావే కానీ, నీపు ఇంకా రాలేదు కదా! మా అమ్మతో కూడా [శ్రీ మహాలక్ష్మితో] కలసి వచ్చిన నాడే, నీకిస్తాను" అని , అన్నాడు . అందుకు ఆనందించిన స్వామి అలాగే కానిమ్మని , అంతర్హితుడయ్యాడు . మరి కొన్నాళ్ళకి , లోక మాత అయిన లక్ష్మీదేవితో కూడి , ఇక యుగాంత పర్యంతం ,స్థిర నివాసం ఏర్పరచుకోటానికి వచ్చినప్పుడు , మళ్ళీ అగస్త్యాశ్రమానికి వచ్చాడు . అప్పుడు అగస్త్యఋషి అక్కడ లేడు . శిష్యుడెవరో ఉంటే వెంకన్నస్వామి ఈమాటే అతనితో చెప్పాడు. అతను "అలాగే ! స్వామీ !మా గురువుగారెక్కడికో వెళ్ళారు, రాగానే , చెబుతానన్నాడు. స్వామి వెనుదిరిగాడో లేడో ! అగస్త్య మహర్షి తన ఆశ్రమానికి వచ్చాడు. వెంటనే శిష్యుడు గోవు విషయం చెప్పి "అడుగో !స్వామి !" అని అటుగా చూపించాడు ". అలాగా ! దేవ దేవుడు నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకపోవడం ఎంత దురదృష్టం ! " అని ఏంతో మదిలో నొచ్చుకుంటూ , పాకలో ఉన్న గోవు నొకదానిని కట్టు విప్పి , గబగబా వేంకటేశ్వరుని వెంటబడి ,"గోవు+ఇందా !" "గోవు+ఇందా !" అని కేకలు వేసుకుంటూ, వెనకాలే వెళ్ళాడు . 'ఇందా 'అంటే "ఇదిగో ! తీసుకో ! " అని అర్ధం కాబట్టి , మునీంద్రుడు ఎలుగెత్తి , " గోవిందా ! గోవిందా !" అని అరుస్తూ , వెంటబడి వెళుతూనే ఉన్నాడు . శిఖరాగ్రానికి చేరే సరికి , నూటెనిమిది సార్లు ముని , "గోవిందా ! గోవిందా ! " అని కేకలు వేశాడు . అప్పుడు స్వామి వెనుదిరిగి , "మునీంద్రా ! గో...విదిగో ! తీసుకో ! అనే అర్ధంతోనే అయినా, నన్ను నీవు "గోవిందా ! గోవిందా! "అని నూటెనిమిది సార్లు నన్నుద్దేశించి అన్నావు కాబట్టి, గోవిందుడనేది, నా నామాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
 
నాకీ "గోవింద" నామం ఎంతో ప్రీతి పాత్రమయ్యింది కూడా ! నీలాగే ఈ కొండనెక్కే నా భక్తులు, నన్నుద్దేశించి , "గోవిందా ! గోవిందా! "అని నూటెనిమిది సార్లు పలికితే, వాళ్ళకి మోక్షమిస్తాను " అని వాగ్దానం చేసి, అగస్త్యుడిచ్చిన గోవును ఆప్యాయంగాస్వీకరించాడు.
కనుకనే, ఏడుకొండల స్వామిని దర్శించే భక్తులు "ఏడు కొండల వాడా ! వెంకట రమణా ! గోవిందా ! గోవిందా ! అడుగు దండాల వాడా ! గోవిందా ! గోవిందా ! ఆపద మ్రొక్కుల వాడా ! గోవిందా !గోవిందా ! అని నోరారా పిల్చుకుంటూ , స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు భక్తులు. గోవింద నామ స్మరణం చేస్తేనే ఆ స్వామికి ప్రీతి కదా ! సహస్ర నామాలున్న ఆ వేంకటేశ్వర స్వామిని ఇలా "గోవిందా !గోవిందా !" అనే గోవింద నామార్చనతో పిలుస్తూ నేటికీ భక్తులు తరిస్తున్నారు కదా !!!
 
ఇదండీ గోవింద నామ ఆవిర్భావ రహస్యం.
 

శ్రీవారి సేవలు

🙏 విశ్వరూప దర్శనం 🌈

 
💫 శ్రీవారి పాదాలపై బంగారు తొడుగులు, తులసి, పుష్పాల వంటివి లేకుండా, స్వామివారి దివ్యమంగళరూపం ఆపాదమస్తకం కనిపించే ఈ దర్శనాన్ని "విశ్వరూపదర్శనం" అంటారు. ఇలా ఎందుకన్నారంటే..... 
 
💫 రాత్రి ఏకాంతసేవకు ముందు చిన్న గంధం ముద్ద భోగశ్రీనివాసుని వక్షఃస్థలంలోనూ, మరో కొంచెం గంధం మూలమూర్తి పైనున్న అమ్మవారి వద్ద ఉంచుతారు. ఇతర పూజాద్రవ్యాలు వేరొక పళ్ళెంలోను, ఐదు బంగారు పాత్రలలో శుద్ధమైన నీరు కూడా ఉంచుతారు. అంతే గాకుండా, స్వామివారి పాదాలకున్న బంగారు తొడుగులు తీసి, రెండు పాదాలపై రెండు గంధం ముద్దలు ఉంచి వాటిపై చిన్న వస్త్రం కప్పుతారు. 
 
💫 బ్రహ్మాది దేవతలు నిశిరాత్రి (రాత్రి ఏకాంతసేవకు మరియు మరునాటి వేకువఝామున జరిగే సుప్రభాతసేవకు మధ్య) సమయంలో విచ్చేసి శుధ్ధోదకం, చందనం, ఇతర పూజాద్రవ్యాలతో స్వామివారిని అర్చించుకోవడం కోసం ఈ ఏర్పాటు. ఇదివరలో ఈ గంధాన్ని, తీర్థాన్ని సుప్రభాత సేవకు విచ్చేసిన భక్తులకు ఇచ్చి, పాదవస్త్రాలను కళ్ళకద్దుకోనిచ్చేవారు. ఇప్పుడు మాత్రం చందన, తీర్థాలను మొదటగా అర్చకస్వాములు స్వీకరించి, తరువాత జియ్యంగారికి, ఏకాంగికి, సన్నిధిగొల్లకు అందజేస్తారు. సన్నిధి గొల్లకు వీటితో పాటుగా నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని కూడా ఇస్తారు. నిశిరాత్రి సమయంలో బ్రహ్మచే పూజించబడిన స్వామివారి "విశ్వరూపాన్ని" యథాతథంగా, మరునాడు ఉదయం సుప్రభాత సేవకు విచ్చేసిన భక్తులు దర్శించుకుంటారు కావున ఈ దర్శనాన్ని "విశ్వరూపదర్శనం" గా పిలుస్తారు.
 

🙏 నవనీతహారతి 🌈

💫‌ అప్పుడే తీసిన వెన్న, ఆవుపాలను నివేదించి ఇచ్చే హారతి గావున, సుప్రభాత సేవలో స్వామివారికిచ్చే తొలిహారతిని "నవనీతహారతి" గా వర్ణిస్తారు. స్వామివారికిచ్చే అనేక రకాలైన హారతుల గురించి మరోసారి తెలుసుకుందాం.
 
💫 అనంతరం జియ్యంగార్, ఏకాంగి, సన్నిధి గొల్ల బంగారువాకిలి వెలుపలికి వస్తారు. దేవస్థానం పరిచారకులు లోనికి వెళ్ళి శ్రీవారి పాన్పునూ, మంచాన్నీ తీసి ఆనందనిలయానికి ఉత్తరంగా ఉన్న "సబేరా" అనబడే గదిలో ఉంచుతారు.
 
💫 సుప్రభాతం పఠించిన వేదపండితులు, అన్నమయ్య వంశీయులు, మహంతు, మైసూరు సంస్థానంవారు స్వామి వారి సన్నిధికి వెళ్ళి హారతి, తీర్థం, శఠారి, చందనం, వెన్న, ఇతర మర్యాదలు పొందుతారు. తదుపరి స్వామివారి సుప్రభాతసేవకై వేచివున్న భక్తులు వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకుని, అనంతరం ఆనందనిలయానికి దక్షిణం వైపునున్న ఓ ఎత్తైన అరుగుపైన, అంకురార్పణ మండపం నందు తీర్థం, శఠారులను స్వీకరించి ధన్యులవుతారు.
 
💫 నిత్యం శ్రీవారికి జరిగే అనేక సేవల్లో తొలిసేవ కావటం, బంగారువాకిలిని తెరిచే ఆసక్తికరమైన సాంప్రదాయాన్ని కళ్ళారా వీక్షించగలగటం, బంగారువాకిలి ముందు దాదాపు ముప్ఫై నిముషాలు నిలబడి, వీనులవిందైన సుప్రభాతగానాన్ని వేదపండితుల ద్వారా వినగలగటం; అప్పుడే వెలిగించిన ఆవునెయ్యి దీపాలకాంతిలో స్వామివారి దివ్యమంగళ "విశ్వరూపాన్ని" కన్నులారా దర్శించ గలగటం వంటి కారణల వల్ల సుప్రభాత సేవంటే భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. 
 
🙏 తాత్కాలిక అడ్డంకులన్నీ తొలగి, ఈ సేవాదర్శనభాగ్యం మీకు అతి త్వరలోనే కలగాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాం. 🙏
 

 🙏 తిరుప్పావై పఠనం 🌈

 
💫 సంవత్సరంలో పదకొండు మాసాల పాటు స్వామివారిని మేలుకొలిపే సుప్రభాతపఠనం, ధనుర్మాసంలో మాత్రం జరుగదు. ఆ మాసంలో సుప్రభాతానికి బదులుగా, "తిరుప్పావై" పఠిస్తారు. పన్నెండుగురు ఆళ్వార్లు రచించిన "దివ్యప్రబంధం" లోని ముప్ఫై పాశురాల మాలికను "తిరుప్పావై" గా పిలుస్తారు. "ఆండాళ్ అమ్మవారి" గా కొలువబడే గోదాదేవి, శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందటం కోసం చెలులతో కలిసి, ముప్ఫైరోజుల పాటు కఠిన వ్రతమాచరిస్తూ, "తిరుప్పావై' గానం చేసినట్లు ప్రతీతి.
 
💫 మూడు వైష్ణవదివ్యక్షేత్రాలలో ఒకటైన (శ్రీరంగం, కంచి మిగిలిన రెండు క్షేత్రాలు) తిరుమల, "పుష్పమంటపం" గా పేర్గాంచింది. పుష్పప్రియులైన స్వామివారి నిత్యకైంకర్యాలలో, ఉత్సవాలలో, అలంకరణలో పుష్పాల్ని విరివిగా వినియోగిస్తారు.
 
💫 సుప్రభాత సేవానంతరం, పుష్పాలే ప్రధానంగా శ్రీవారికి నిత్యం జరిగే "తోమాలసేవ" ను మంగళ, బుధ, గురువారాల్లో మాత్రమే భక్తులు దర్శించ గలరు. ఆ మూడు రోజులు ఇది అర్జిత సేవగా పరిగణించ బడుతుంది. మిగిలిన నాలుగు రోజులు ఈ సేవ ఏకాంతంగా జరుగుతుంది. అయితే, శుక్రవారం మాత్రం సుప్రభాత సేవానంతరం అభిషేకం, తదనంతరం తోమాలసేవ జరుగుతాయి.
 

🙏 తోమాలసేవ 🙏

 
💫 తోమాలసేవ అంటే?
 
💫 తోమాలసేవ - భోగశ్రీనివాసునికి జరిగే అభిషేకం.
 
💫 శ్రీనివివాసుని దివ్యమంగళమూర్తికి అనేక పుష్పమాలలతో, తులసిమాలలతో, అనునిత్యం చేసే సేవాకైంకర్యమే "తోమాలసేవ". ఈ సేవకు "తోమాలసేవ" అనే పేరు రావడం వెనుక అనేక కథనాలున్నాయి.
 
💐‌తమిళంలో 'తోడుత్తమాలై' అంటే నారతో కట్టిన మాల అని అర్థం. కాలక్రమంలో అదే 'తోమాల' గా మారి ఉండవచ్చు.
 
💐‌'తోల్' అంటే భుజం అని అర్థం. భుజం నుంచి  వ్రేలాడే మాలలు గనుక 'తోమాలలు' అని అంటారు.
 
💐 'తోమాల' అంటే చేతితో కట్టిన పూలదండ అని మరియొక అర్థం కూడా ఉంది.
 
💐 అంతే కాకుండా, తోమాల అంటే తోటలో నుండి తెచ్చిన పూమాలలు లేదా తులసిమాలలు అనే అర్థం కూడా ఉంది.
 
💫 దాదాపుగా పైన చెప్పిన అర్థాలన్నీ ఈ సేవకు వర్తిస్తాయి.
 
💫‌ ముందురోజు రాత్రే ఆయా కాలాల్లో లభించే అనేక రకాల, రంగురంగుల, పరిమళ పుష్పాలతో తయారు చేయబడిన పుష్పమాలికలను, విమాన ప్రదక్షిణం లోని యోగానరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న శీతల పుష్పఅర లో సిద్ధం చేస్తారు.
 

🙏 అభిషేకనిమిత్తం ఆకాశగంగ తీర్థం 🙏

💫‌ మూలవిరాట్టుకు నవనీతహారతిని సమర్పించగానే భోగశ్రీనివాసునుకి జరిగే అభిషేకంతో  "తోమాలసేవ" ప్రారంభమవుతుంది. ఈ అభిషేకానికి - పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంలో తరించిన మహాభక్తుడు తిరుమలనంబి వంశీయులు (వీరిని "తోళప్పాచార్యులు" గా పిలుస్తారు), దేవాలయానికి దాదాపు మైలున్నర దూరాన ఉన్న ఆకాశగంగ తీర్థాన్ని వెండి బిందెలతో, ఛత్రచామర మంగళవాద్య మర్యాదలతో, తెల్లవారకముందే తీసుకుని వచ్చేవారు. నడిరేయి చిమ్మచీకట్లలో, రక్షకభటులు వెంటరాగా, అరణ్యమార్గంలో, కాలినడకన, తరతరాలుగా ఈ అభిషేకజలాన్ని భుజాలపై మోసుకుంటూ తెస్తున్న తిరుమలనంబి వంశీయులు ధన్యజీవులు. అయితే ఈ మధ్యకాలంలో, ఆకాశగంగ నుండి అభిషేకజలాన్ని తెచ్చే లాంఛనం కేవలం శుక్రవారం నాడు మూలమూర్తికి జరిపించే శుక్రవారాభిషేకానికి మాత్రమే పరిమితం చేశారు.
 
💫 ఈ తీర్థాన్ని తెచ్చి, ఆలయానికి ప్రదక్షిణ చేసి, ఆ బిందెలను సన్నిధిలో ఉంచేవారు.
 

🙏 భోగశ్రీనివాసునికి అభిషేకం 🙏

💫 అనంతరం అర్చకస్వాములు శ్రీవారికి నమస్కరించి, సుప్రభాతసేవలో మేల్కొలపబడిన భోగశ్రీనివాసుణ్ణి వెండి స్నానపీఠంపై వేంచేపు చేయిస్తారు. ఆర్ఘ్య, పాద్య, ఆచమన, అనుష్ఠాన, ఉపచారాలు చేసిన తరువాత, బంగారుబావిలో నిలువ ఉంచబడిన ఆకాశగంగ తీర్థంతో భోగశ్రీనివాసునుకి అభిషేకం చేస్తారు.
 
💫 తరువాత శ్రీవేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) వారి నిజపాదాలపై ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు. వేదపండితులు పురుషసూక్తం పఠిస్తూండగా, అర్చకులు శ్రీవారి సన్నిధిలోని నృసింహ, శ్రీరామ సాలగ్రామాలకు కూడా అభిషేకం చేస్తారు. అనంతరం మూలమూర్తికీ, వక్షస్థలలక్ష్మికీ, శ్రీదేవీ-భూదేవి సహిత మలయప్పస్వామికీ, ఉగ్రశ్రీనివాసునికీ, ఇలా సన్నిధిలో వున్న పంచబేరాలకు, అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగ తీర్థంతో సంప్రోక్షిస్తారు.
 
💫 అయితే రోహిణీనక్షత్రం నాడు మాత్రం సన్నిధిలోనే వున్న రుక్మిణీ శ్రీకృష్ణులకు కూడా తిరుమంజనం (అభిషేకం) నిర్వహిస్తారు. అలాగే, పునర్వసు నక్షత్రం నాడు సీతారామలక్ష్మణులకూ, శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం నాడు శ్రీదేవీ-భూదేవి సహిత మలయప్పస్వామికీ కూడా అభిషేకం జరుగుతుంది.
 
💫 అభిషేకానంతరం భోగశ్రీనివాసునికి వస్త్రాలంకరణ, తిలకధారణ చేసి; మిగిలిన ఉత్సవమూర్తులకు షోడశోపచారాలు సమర్పిస్తూండగా జీయ్యరు గార్లు, వైష్ణవస్వాములు దివ్యప్రబంధంలోని ఆళ్వార్లు గానం చేసిన 'తిరుప్పళ్ళి ఎళుచ్చి' అనే అరువది పాశురాలను పారాయణం చేస్తారు.
 

🙏 శ్రీవారికి పుష్పాలంకరణ 💐

💫 ఉత్సవమూర్తు లందరికీ అభిషేకాదులు జరిగిన వెనువెంటనే, జియ్యంగారు పూలమాలలు ఉన్నట్టి వెదురుగంపను తలపై పెట్టుకుని, ఛత్రచామర మర్యాదలతో, పలక గంట-సన్నడోలు మ్రోగుతుండగా, సన్నిధి గొల్ల దివిటీతో దారి చూపుతుండగా, పుష్పఅర నుండి బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి, వెండివాకిలి ద్వారా లోనికి వచ్చి, విమాన ప్రదక్షిణ చేసి, బంగారు వాకిలి ద్వారా, శ్రీవారి సన్నిధిలో ఉన్న అర్చకులకు అందజేస్తారు.
 
💫 అర్చకస్వాములు ఈ మాలలను స్వీకరించి, నీళ్లతో శుద్ధి పరుస్తారు. ఆ మాలలతో ముందుగా భోగశ్రీనివాసుణ్ణి అలంకరించి, ఆ తరువాత మూలమూర్తికి కంఠంలోనూ, హృదయం పైనా పుష్పమాలు వేసి, శంఖుచక్రాలను, కిరీటాన్ని, నందకఖడ్గాన్ని అలంకరిస్తారు.
 
💫 ఆ తరువాత భుజాలమీదుగా నాభి వరకు, నడుమువరకు, ఊరువుల వరకు, మోకాళ్ళవరకు, పాదాల వరకు వ్రేలాడునట్లుగా పొడవైన పూలదండలను అలంకరిస్తారు. ఈ పుష్పాలంకరణం శ్రీవారి పాదాలతో మొదలవుతుంది.
 
💫‌‌ అమలులో ఉన్న ఆచారం ప్రకారం, శ్రీవారికి శిఖామణిని అలంకరించేటప్పుడు, తెరవేసి మరలా తీస్తారు. 
 

🙏 మాలలకు పేర్లు 💐

💫 ఆపాదమస్తకం అలంకరింపబడే ఈ పుష్పమాలలకు కొన్ని స్థిరమైన పేర్లు ఉండటం విశేషం -
 
⛩️ శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కక్క మూర గల రెండు పుష్పమాలలను - తిరువడి దండలు అంటారు. 
 
⛩️‌ శ్రీవారి కిరీటం మీదుగా రెండు భుజాలవరకు అలంకరింపబడే 8 మూరల పుష్పమాలను - శిఖామణి అంటారు.
 
⛩️ శ్రీవారి భుజాలనుండి ఇరువైపులా పాదాలవరకు వ్రేలాడునట్లుగా అలంకరించే పొడవాటి మాలను -  సాలగ్రామమాల అంటారు.
 
⛩️ శ్రీవారి మెడలో రెండు వరుసలుగా భుజాలమీదికి అలంకరించబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని - కంఠసరి అంటారు.
 
⛩️‌ శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు ఒకటిన్నర మూరల పొడవుండే రెండు పుష్పమాలికలను - వక్షస్థలమాలలు  లేదా వక్షఃస్థల తాయార్ల సరాలు అంటారు.
 
⛩️ ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను శంఖుచక్రాలకు అలంకరిస్తారు. వీటిని - శంఖుమాల, చక్రమాల అంటారు.
 
⛩️ శ్రీవారి నందకఖడ్గానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను - కఠారిసరం అంటారు.
 
⛩️ రెండు మోచేతుల క్రింద నుండి పాదాలవరకు వ్రేలాడదీసే రెండు పుష్పమాలలను - తావళములు అంటారు. వీటిలో ఒకటి 40 అంగుళాలు మరియొకటి 50 అంగుళాల పొడవు ఉంటాయి. వీటిని శ్రీవారికి ఇంగ్లీషు అక్షరం U ఆకారంలో ధరింపజేస్తారు.

🙏 ఉత్సవమూర్తులకు పుష్పమాలాలంకరణ 💐

💫 శ్రీవైష్ణవస్వాములు గోదాదేవి కీర్తించిన తిరుప్పావై లోని "తిరుప్పళ్ళియెళుచ్చి," "తిరుప్పళ్ళాండు" మొదలైన పాశురాలు శ్రావ్యంగా గానం చేస్తుండగా, అర్చకస్వాములు శ్రీదేవీ-భూదేవి సమేతుడైన మలయప్పస్వామికీ, ఉగ్రశ్రీనివాసమూర్తికీ, కొలుపు శ్రీనివాసమూర్తికీ, సీతాలక్ష్మణ సమేతుడైన కోదండరామస్వామికీ, రుక్మిణీ సమేతుడైన శ్రీకృష్ణునికీ, చక్రత్తాళ్వార్ కు మరియు సాలగ్రామాలకు పుష్పమాలలు అలంకరిస్తారు.
 

🙏 ధూప దీప హారతులు 🙏

 
💫 పుష్పమాలాలంకరణ పూర్తయిన తరువాత వేదపండితులు మంత్రపుష్పాన్ని సమర్పిస్తారు. ఆ తరువాత స్వామివారికి ధూప, దీప, నక్షత్ర హారతులు, చివరగా కర్పూరహారతి సమర్పిస్తారు.
 

🙏 ముప్పూటలా తోమాలసేవ 🙏

 
💫‌ ఈ సేవ సుమారు అరగంటకు పైగా జరుగుతుంది.
 
💫 నిత్యార్చనలో భాగంగా జరిగే ఈ తోమాలసేవ, ఉదయం విస్తారంగా, మధ్యాహ్నం క్లుప్తంగా మరల సాయంత్రం విస్తారంగానూ, ముప్పూటలా జరుగుతుంది. ఉదయం జరిగే తోమాలసేవ మాత్రమే అర్జితసేవ. అప్పుడు మాత్రమే ఈ సేవను భక్తులు దర్శించుకోగలరు. మధ్యాహ్నం, రాత్రి జరిగే తోమాలసేవలు ఏకాంతంగా జరుగుతాయి.
 
⛩️‌ ఈ మాలలన్నింటినీ మూర (18 అంగుళాలు), బార (36 అంగుళాలు) కొలమానంతో వ్యవహరిస్తారు.
 
🙏 అంతటితో తోమాలసేవ ముగిస్తుంది. 🙏

గుడికి ఎందుకు వెళ్ళాలి

మనం నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవడం ఒక దైనందిన జీవిత చర్యగా ఏర్పరచుకుంటాం. అలా దేవాలయంలో దైవదర్శనం చేసుకుంటూ మనం కొన్ని నియమాలు పాటిస్తుంటాం. కాని అలా ఎందుకు పాటిస్తున్నామో వాటి వెనుకనున్న అంతరార్థ పరమార్థాలేమిటో మనకు అంతా తెలియవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
తీర్థ స్నానం: ఉదయాన్నే చన్నీటి స్నానం: ముఖ్యంగా ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ఉన్న చన్నీటి స్నానం శుచితోబాటు ఏకాగ్రతను కల్గిస్తుంది. అందులో ఖనిజ సంబంధమైన చన్నీటి స్నానం, అందులో చేసే సూర్యనమస్కారం శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా కుంభమేళా మొదలైన పవిత్ర సమయాల్లో పరమయోగులు తీర్థాల్లో, నదుల్లో స్నానం చేస్తారు. కాబట్టి ఆ తీర్థస్నానం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే పుష్కర సమయాల్లో తీర్థస్నానం కూడా ఎంతో పవిత్రమైనది.
 
ప్రదక్షిణం: ఆలయం ప్రాకారం లోపల, గర్భగుడికి వెలుపల మూడు ప్రదక్షిణలు చేస్తాం. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయం చుట్టూ పరచబడిన రాళ్ళపై వట్టి కాళ్ళతో నడుస్తాం. అలా రాళ్ళపైనున్న సన్నని రంధ్రాలపై అది కాళ్ళ బరువు ఆనుతుంది. ఆ ఒత్తిడికి కాళ్ళలోనున్న నరాల కూడళ్ళు కదిలి, ఇతరావయవాలు చక్కగా పనిచేస్తాయి. దీనినే ఆక్యుపంచర్ అంటారు.
 
ఆలయంలో కూర్చోవటం: దర్శనం తర్వాత ఆలయంలో కూర్చొని వెళ్ళటం ఒక ఆచారం. ఇందుకు కారణం ఆలయంలో అనేక వృక్షాలుంటాయి. వాటికి ఔషధశక్తి ఉంటుంది. కావున ఆ చెట్టుక్రింద గాని, చెట్టుముందుగాని, ఆలయంలో ఎక్కడైన కూర్చొని ధ్యానం చేస్తే ఊపిరితిత్తులను శుభ్రపరిచి, శరీరం పైనున్న విషక్రిములను నాశనం చేసి, శరీరారోగ్యాన్ని కాపాడుతుంది, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కుదురుతుంది.
 
జపం: ఆలయంలోని వృక్షం క్రింద ఉన్న విగ్రహం ముందు గాని, ఆలయంలో విగ్రహం ముందు గాని కూర్చొని జపం చేస్తుంటాం. అనగా ఉత్తరాభిముఖంగా నుండి ధ్యానం చేసేటప్పుడు, ఉత్తర దిశలోని అయస్కాంత శక్తి ప్రభావానికి లోనై రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది.
 
ఆలయ నిర్మాణం: ఆలయం నిర్మాణానికి, చక్కటి ప్రకృతి రమణీయ స్థలాన్ని నిర్దేశించి, లోపాలేవి లేని సుక్షేత్రమును ఎన్నుకొని నిర్మిస్తారు. ఆలయంలో వాస్తు, జ్యోతిష్యం, ఆరోగ్యం, సంగీతం, నృత్యం వంటి సర్వశాస్త్ర సమ్మిళితం.
 
దేవతా విగ్రహాలు: ప్రత్యేక ముహూర్తంలో పవిత్రతో, పద్ధతితో మంత్రతో సేకరించబడిన రాళ్ళను విగ్రహాలుగా చెక్కి ఒక సుముహూర్తాన దేవాలయంనందు ప్రతిష్ఠింపబడతాయి. ప్రాణప్రతిష్ఠ జరుపబడిన ఈ దివ్యశిలలు సూర్య, చంద్రుల, వరుణ, వాయువుల ప్రభావాలకులోనై ఖనిజాలుగా మారి విద్యుత్‌శక్తి కలిగి ఇతర దివ్యశక్తులను పొంది, అపూర్వ గుణగణ సంపూర్ణమైనవిగా వెలుస్తాయి.
 
ఈ దివ్య విగ్రహాలనుండి వెలువడే బ్రహ్మపదార్థము, దివ్య పరిమళము, భక్తులు శిరస్సు వంచి చేయబడు ప్రార్థన మూలకంగా మెదడు ద్వారా శరీర ప్రవేశం చేస్తాయి. దేవతా విగ్రహాల నుండి వెలువడే కిరణాలు, ప్రకంపనాలు భక్తుని మనస్సును నిర్మలంగా ఉంచడానికి దోహదపడతాయి. కాని విగ్రహాల క్రింద స్థాపించబడిన యంత్రాలనుండి వెలువడే తరంగాలు మానవుణ్ణి మహోన్నత స్థితికి చేరుస్తాయ.
 
నమస్కారం: భక్తులు ఆలయంలో చేసే నమస్కారాల పద్ధతిలో వ్యాయామం దాగుంది. దీనివలన మెడ, తుంటి, మోచేయి, కాలు, చీలమండలం మొదలైన శరీర భాగాలన్నీ తేలికగా కదిలి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. సాష్టాంగ నమస్కారం సర్వశ్రేయస్కరం, అలాగే వినాయకునికి చేసే గుంజీలు కూడా ఇందులో భాగాలే.
 
మంత్రం: ఆలయంలో అర్చకులు చేసే మంత్ర ఉచ్ఛారణ మనలో చైతన్యాన్ని ప్రకృతిలో శక్తిని పెంపొందిస్తుంది. కొన్ని మంత్రాలు మానవునికి ఆరోగ్యాన్ని, శక్తిని కోరికలను తీరుస్తాయి.
 
తీర్థం: ఆలయంలో భక్తులకు ఇచ్చే తీర్థంలో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి. వాటిని స్వీకరించడం ద్వారా ఆరోగ్యం, మానసిక, శారీర ప్రశాంతతనిస్తుంది.
 
ప్రసాదం: దైవదర్శనం అనంతరం ఆలయంలో స్వామికి నివేదించిన ప్రసాదాలు తీసుకోవడం ద్వారా శరీరంలో రక్తప్రసరణకు క్రమబద్ధంచేసి, జీర్ణశక్తిని కలిగిస్తాయి. ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగే అక్కడ ఇచ్చే పసుపు నీరు, నిమ్మరసం, విభూతి, కుంకుమ, అభిషేక జలం, మన్ను మొదలైనవి సేవించడం వలన మానసిక రుగ్మతలు అరికట్టబడతాయి.
 
ఏకాగ్రత: దేవాలయంలో చెక్కబడిన మూర్తులు, శిల్పాలు, పురాణగాథలు, ఇతర కథలు ప్రాపంచిక ధోరణినుండి మనసును మరల్చి, మన సంస్కృతీ సాంప్రదాయాల విధులు, విలువలు, విధానాలు మనకు తెలియజేస్తూ, పరిశుభ్రతను, స్వచ్ఛతను, సామాజిక సంబంధ, బాంధవ్యాలను పెంచుతూ మానవతా, ఆధ్యాత్మిక, ఆరోగ్య కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.

Prasadam:

We all know about Thondaman Chakravarthy. He was the brother of father in law of Srinivasa Perumal. And also a great devotee of Venkateswara. After building the temple for Sri Venkateswara swamy at Tirumala, he used to do pooja there for Lord daily. He did Archana with golden Tulasi leaves/some tell golden flowers too. One day, as usual, he went to temple to do Archana. Then, he saw flowers and Tulasi dalam made with mud. And the golden ones with which did before Day were kept a side.He shocked for this incident as the ones with which he did were kept aside and leaves made with mud are near to Lord's lotus feet. He asked Perumal about this. Then, Venkatapathi said:
“Those were offered to me by Bhima. He was a potter. He was poor also. But, he never felt of any scarcity because of his devotion towards me. He believes in me completely. Being a potter, he offers flowers/Tulasi dalams made with mud to the murthy of mine in his house. After doing pots, with the mud on his hands, he makes flowers and offer to me. For him, it's not just a murthy/idol. He believes completely that it's me. And while offering too, he offer with utmost devotion. He always thinks of me even while doing his works too.”
After listening about Bhima, Thondaman felt surprised and asked Lord about the address of Bhima. Perumal said "He lives in the village named Kurvakam.". Thondaman Chakravarthy finished his pooja and went to meet Bhima.
Bhima felt surprised as King came to his house and invited him. King asked “Bhima! Sri Vishnu felt happy for your pooja. Tell what'sthe secret in that”. After asking this, he also said what was happened. Then, Bhima replied “King! I'm a low caste person and wasn't educated like you. Who am I to tell about Sripathi and his thathvam to you..!!!!!”
While they were talking, Sri vishnu went on Garuda Vahanam to the house of Bhima. Both offered pranams to Lord and felt happy for his darsanam. Sri Venkateswara Parabrahma asked Bhima that he was hungry and want to eat!!!!!!!!!!!! Then, Bhima said “Hey Paramathma! I’m a poor man and don’t have varieties of foods to offer to you….” Then Lord said “Who said I want much varieties to eat….!!!!!!!! No need. You offer what you eat. I’ll have that only.”
Then, Bhima’s wife offered Lord rice in a mud bowl/plate. He ate with lots of love and got satisfied….
Then Lord said “Oh Punyathma! Bhima!! I’m bestowing salvation to you.” Then, Bhima, with his wife attained salvation.
After that, Thondaman Chakravarthi asked Srinivasa “Hey Prabhu! You gave salvation to Bhima while I was talking to him. In the same way, when will you give salvation to me??”
Lord said “Don’t worry. Before, Bhima asked me for salvtion. I promised him that you’ll be bestowed salvation when your bhakthi will be known others and King comes to meet you. You too increase your bhakthi on me. I’ll bestow salvtion.”
Thondaman Chakravarthy too increased his devotion towards Lord and attained salvation.
And as Bhima and his wife offered meals to Lord in a mud plate with utmost devotion, even today, though there are many varieties offered, Venkateswara swamy will also be offered curd rice in a mud plate/bowl at the time of Naivedyam. And only that one is allowed into the Garbhalayam whereas all other naivedyams offered will be outside of Kulasekhar Alwar Gadapa. These mud bowls aren’t used second time. That means, after offering in that bowl, the new bowl will be used in the Naivedyam next time.
 
गोविंदा  गोविंदा 🙏🏻
 

తిరుమల స్థలంపురాణం :

తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాలతో వున్న చిన్న మండపాన్ని కట్టించినది ఒక గొల్లపడుచు. తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకొని రమ్మని పాలూ, పెరుగూ ఇచ్చి పంపేది. ఆమె ఆ శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా వుండేది. ఒక రోజు ఆమె శిల్పులతో అన్నలారా నా పేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగా, ఆ శిల్పులు చెల్లెలా ముందే చెప్పలేకపోయావా పై నుండి వచ్చిన, బెజవాడ దుర్గమ్మ పంపిన సొమ్మంతా అయ్యిపోయింది అన్నారట. 
 
అప్పుడు ఆ గొల్ల పడుచు అన్నలారా ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది నా డబ్బుతో కడితే నిలుస్తుంది కానీ, మా అత్తగారు చెప్పిన దాని కంటే మీకు అణా ఎక్కువకి పాలూ, పెరుగూ అమ్మాను ఆ డబ్బును మూడు కొండ రాళ్ళను ఒక దగ్గరకు చేర్చి ఆమధ్యలో దాసుకొన్నాను. ఆ డబ్బుతో కట్టండని కట్టించిందట అదే నేటి గొల్ల మండపం. (కోర్ల సంబరం లోని కథ ఇది.)
 
 సామవాయి 
 
సామవాయి పల్లవ వంశానికి చెందినరాజవంశీయురాలు. పల్లవులు కంచి రాజధానిగా పాలించారు. 
 
తిరుమలలో వెంకటేశ్వరునికి నిత్యారాధనా సంప్రదాయంలో సామవాయి పాత్ర చిరస్మరణీయమైనది.
క్రీ.శ.922లో సామవాయి ఇచ్చిన దానశాసనం నేటికీ లభ్యమవుతున్నది. బహుశా అంతకు పూర్వం నిత్యపూజలకు ఏర్పాట్లు లేవు. వెంకటేశ్వరుని నిత్య పూజా నిమిత్తం తిరుచానూరులో మణి మాణిక్యాలను, వజ్రవైఢూర్యాలను, గోసంపదను సామవాయి సమర్పించింది.
 "సూర్య చంద్రులున్నంతవరకూ ఈ దానం చెల్లుబాటు అవుగాక" అని ఆశించింది. "తాను ఏయే పూజలకోసం వితరణ చేసిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరించేవారు ఎవరైనా గాని, వారి పాదములు తన శిరస్సుకు అలంకారముగా భాసించుగాక" అని దాన శాసనం వ్రాయించింది. 
 
సామవాయి శాసనం గర్భగుడి ఉత్తరంవైపు గోడపై ఉంది. ఈ పల్లవరాణి కూర్చిన సంపదతో క్రీ.శ.966 అక్షయనామ సంవత్సరం గురువారం ఆగస్టు 30వ తేదీన, తిరుమలేశునికి తొలి బ్రహ్మోత్సవం జరిపారు. వెయ్యేళ్ళ తరువాత ఇప్పటికీ సామవాయి నిర్దేశించిన విధానంలో "నాలుగు నాలీల ఉడికిన అన్నం" మాత్రమే గర్భగుడిలో శ్రీవారికి సమర్పిస్తారు. ఇతర నైవేద్యాలు గర్భగుడి బయటమెట్టు కులశేఖర పడి వెలుపలనే ఉంచి స్వామికి నివేదిస్తారు. ఈ రుచికరమైన నైవేద్య పదార్ధాలను "కామ్యార్ధాలు" అంటారు.తిరుమలలో స్వయంభూమూర్తి అయిన శ్రీనివాసుని 8 అడుగుల విగ్రహాన్ని ధృవబేరం అంటారు. ఈ విగ్రహానికి నిత్య పూజలు జరుగవు. మూల విరాట్టును అర్చించే అర్హత బ్రహ్మాది దేవతలకు, మహర్షులకు మాత్రమే ఉందట. నిత్య పూజలన్నీ కౌతుక బేరం అనబడే భోగ శ్రీనివాసునికే జరుగుతాయి. 
 
ఈ భోగశ్రీనివాసుని ప్రతిమ 8 అంగుళాల వెండి విగ్రహం. ధృవబేరం నమూనాగా ఉంటుంది. ధృవబేరం ప్రక్కనే ఉన్న ఈ కౌతుకబేరంలో శ్రీనివాసుని మహిమ ఒక 32 పోగుల వెండిదారం, బంగారు గొలుసుతో ఆవాహన చేయబడ్డాయి. 
 
ఈ "సంబంధ సూత్రం" ఎప్పుడూ కలిపే ఉంటుంది. ఆరాధనలన్నీ భోగ శ్రీనివాసునికి కౌతుక బేరం మూర్తికి మరియు అలంకరణలన్నీ ధృవబేరం మూర్తికి జరుగుతాయి. 966 సంవత్సరంలో సామవాయి కాలంలో భోగ శ్రీనివాసుని ప్రతిష్ఠ జరిగిందట.
 

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే అతి పురాతనమైన అభిషేకం

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే అతి పురాతనమైన అభిషేకం గురించి........!!
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి 
ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం. 
 
ప్రతి శుక్రవారం విశేషోత్సవంగా జరుపబడే ఈ అభిషేకం 614వ సంవత్సరానికి పూర్వం నుండే జరిగేదని తెలుస్తున్నది. విశేష సందర్భాల్లో జరిగే ఈ శుక్రవారాభిషేకాన్ని భగవద్రామానుజులవారు శ్రీస్వామి వారి వక్షఃస్థలంలో బంగారు అలమేలుమంగ ప్రతిమను అలంకరింపజేసిన శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం నాడు ఈ అభిషేకం జరిగేట్లు ఏర్పాటు చేశారట.
 
ఆకాశ గంగ తీర్థంతో అభిషేకం..
పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంతో తరించిన మహాభక్తుడైన తిరుమలనంబి వంశీయుడు అందించిన కలశ తీర్థాన్ని తొలుత జియ్యంగారు స్వీకరించి భక్తి ప్రపత్తులతో బంగారు శంఖంతో అందించగా ఆ ఆకాశగంగ తీర్థాన్ని అర్చక స్వాములు శ్రీవారి శిరస్సుపై సమర్పిస్తూ హరిః ఓం సహస్రశీర్షా పురుషః అని పురుష సూక్తాన్ని ప్రారంభిస్తారు. కులశేఖరపడికి ఇవతల ఉన్న విద్వాంసులు పురుషసూక్తం అందుకుని అభిషేకం జరుగుతున్నంత సేపు పంచసూక్తాలను పఠిస్తూనే ఉంటారు. ఆకాశగంగాతీర్థంతో అభిషేకించబడుతున్న శ్రీవారి దివ్య మంగళమూర్తిని వీక్షిస్తున్న భక్తులు ఆ అభిషేకం తామే చేస్తున్నట్లుగా భావిస్తూ తన్మయులౌతారు.పునుగు, కస్తూరి, జవ్వాది మున్నగు సుగంధాధీద్రవ్యాలతో, ఆకాశగంగా తీర్థంతో, సుమారు ఒక గంటపాటు అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థలం మీద ఉన్న మహాలక్ష్మికి కూడా ఈ అభిషేకం జరుగుతుంది.
 
ఎప్పుడో, ఏనాడో బ్రహ్మాది దేవతల కోరికమేరకు కలియుగ మానవుల కోసం వెలసిన శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షఃస్థల లక్ష్మితో కూడా 
ఈ శుక్రవారాభిషేక సమయంలో మాత్రమే దర్శించ వీలవుతుంది.
 
అభిషేకం అయిన తర్వాత శ్రీస్వామివారి మెడలో ఉన్న బంగారు అలమేలుమంగకు కూడా అభిషేకం జరుగుతుంది. ఆర్జితసేవగా జరుపబడుతున్న ఈ అభిషేకోత్సవం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూంది. అభిషేకానంతరం భక్తులందరి మీదా అభిషేక తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేకదర్శనం పూర్తవుతుంది.
 
నిజ పాద దర్శనం: 
ప్రతి శుక్రవారం అభిషేకానంతరం అభిషేక సేవలో పాల్గొన్న గృహస్థులు శ్రైస్వామి వారిని దర్శించి వెళ్లిన తర్వాత నిజ పాద దర్శనం ప్రారంభమవుతుంది.ఆర్జిత రుసుమును చెల్లించిన భక్తులు ఈ సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి నిజపాదాలను అంటే (ఎలాంటి తొడుగులు లేకుండా) దర్శించవచ్చు. ఈ దర్శనంలో మాత్రమే శ్రీవారి నిజపాదాలు దర్శించుటకు ఆవకాశముంటుంది. మిగిలిన వేళల్లో ఆ పాదాలు బంగారు తొడుగులతో విరాజిల్లుతూ ఉంటాయి.

తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి..??

 
👉 ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..?? 
 
➢ 1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు. 
 
⚫ అపట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడా రామానుజా కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ కూడా జరిగినా ఆలయంలో పంచి పెట్టె ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం. 
 
➢ 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. " THOMOS MUNRO " .. 
 
⚫ దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఎలుబడి కింద ఉండేది.
➢ ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు... మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు..
⚫ ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా...ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు. 
 
➢ అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు( అవే వారికి భోజనాలు ).. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా , దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు. (అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు.)
ఆ ప్రసాదాలను భక్త్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద  కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది...
స్వతహాగా విదేశీయుడు కావున... అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని , శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని.... 
 
⚫ మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు  తినకుండా ఆదేశాలు ఇచ్చాడు.. 
 
➢ శ్రీవారి లీల ప్రభావంతో  ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో...అదే  తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి , పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు. 
 
⚫ అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు దన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు. 
 
➢ అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తన కి, సనాతన ధర్మం పట్ల భక్తిని  గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల  శ్రీవారి పట్ల ,ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో..శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది.. 
 
⚫ తప్పు తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం  చాలా గంగాళాలు సమర్పించాడు మరియూ తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే  తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు...... 
 
➢ ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు.
మనోవ్యధ తో   మంచం పట్టి నేరుగా ని సేవలో  పాల్గొని అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827 లో ప్రాణం వదిలాడు. 
 
⚫ అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు... ఈ గంగాళలను ఇప్పటికీ
" మన్రో గంగాళాలు "  అనే పేరుతో  దేవస్థాన పూజా కైంకర్యాల లో చలామణీలో ఉన్నాయి...
శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి  ప్రసాదించాడు. 
 
➢ తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాల లోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారు లీలలు, చరిత్ర  కలదు. 
భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున, ప్రతి గడప కి, ప్రతి చెట్టు కి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది...
శ్రీనివాసుడి గురించి తెలుసుకోండి ..నలుగురికి తెలియజెప్పండి.. 
 
ఓం నమో వెంకటేశాయ..! 🙏
ఓం నమో వెంకటేశాయ..!🙏🙏
ఓం నమో వెంకటేశాయ..!🙏🙏🙏 
 
➢ సేకరణ:- కార్తికేయ'S ఓపెన్ బుక్.🙏🙏
 

వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి

కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే.
 
అంతే కాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు.
 
తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది.
 
అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి.
 
అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
 
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి.
 
ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం
సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది
 

వెంకటేశ్వర స్వామి ముడుపు అంటె ఏమిటి - అది ఎలా కడతారు.............!!

పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇల వేలుపు, ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టే వాళ్ళు . 
 
ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే... వివాహంకోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగ కుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుని కి ముడుపు కడతారు...
 
ముడుపు ఎలా కట్టాలి ...
 
వెంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టినా బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనసుపూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి, కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాటఇవ్వాలి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందా నామాలు చదువుకొని స్వామి కి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉండాలి..కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి...
 
ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతుంది.
 
🙏సర్వేజనా సుఖినోభావంత్🙏
 

శ్రీవారి శుక్రవారాభిషేకం సేవలో పునుగుపిల్లి........!!

అత్యంత అరుదుగా లభించే సుగంధ ద్రవ్యాలకు కారకుడు శుక్రగ్రహం.
 
1) పునుగు, 2) జవ్వాది, 3) కస్తూరి
4) గోరోచనం
 
మొదలగు సుగంధద్రవ్యాలు శుక్రగ్రహ కారకత్వాన్ని తెలియజేస్తాయి. 
 
జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు పునుగుపిల్లితైలం తో అభిషేకం చేస్తే శుక్రగ్రహ దోష నివారణ జరుగుతుంది.
 
శ్రీవారిసేవలో:- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు.
 
" అత్తారు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో " అంటాడు శ్రీఅన్నమాచార్య.
 
పదకవితా పితామహుడు
1) తాళ్ళపాకశ్రీఅన్నమాచార్యులు
2) తరిగొండ శ్రీవెంగమాంబ
 
కలియుగప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి పై వేలు, వందలు సంకీర్తనలు రచించి " శ్రీవారి " అనుగ్రహం పొందగలిగారు.
 
అయితే ఏ కళలూ తెలియని నోరులేని మూగజీవి " పునుగుపిల్లి " ఏ అదృష్టం చేసుకుందో.......
ఎన్ని జన్మల పూజా ఫలమో తెలియదు కాని ఈ అరుదైన జీవికి మరొకరికి సాధ్యం కాని అరుదైన సేవాభావం కలిగింది.
 
శ్రీ ఏడుకొండలస్వామివారి మూలవిగ్రహానికి ఈ " పునుగుపిల్లి " శరీరం నుంచి స్రవించే ద్రవాన్ని పూస్తేనే శుక్రవారపు అభిషేకం పూర్తవుతుంది.
 
శ్రీస్వామివారి విగ్రహం శతాబ్దాలుగా నల్లగా నిగనిగలాడుతుండడానికి, ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండడానికి ఈ పునుగుతైలమే ప్రధాన కారణమని అర్చకుల నమ్మకం.
 
ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ పునుగుపిల్లి అత్యంత అరుదైనది.
 
పునుగుపిల్లితైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది.
 
ఇనుప జల్లెడలోని గదిలో పిల్లిని ఉంచుతారు. ఇనుపజల్లెడ గది పై భాగంలో రంథ్రం ఏర్పాటు చేస్తారు. రంథ్రం ద్వారా చందనపుకర్రను గదిలోకి నిలబెడతారు. 2సంవత్సరాల వయస్సు అనంతరం ప్రతి 10రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపుకర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది.
 
ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగుతైలం.
 
తైలాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూలవర్లుకు అభిషేకం చేస్తారు.
 
ఇలా చేయడం ద్వారా " శ్రీవారు " శాంతపడుతారని అర్చకులు చెబుతున్నారు.
 
నిదర్శనం:- పునుగుపిల్లి అంతరించి పోయింది అని అర్చకులు బాధపడుతున్న సమయంలో ఎక్కడ నుండో శ్రీగరడురాజు తన కాళ్ళతో తీసుకుని వచ్చి వేంకటాద్రికొండ పై వదిలాడు. అది చూసిన అర్చకులు ఆ దేవదేవుడు నిత్యం తిరుమలగిరిపై కొలువై ఉన్నారని నమ్మి, దేవదేవుని సహస్రనామాలతో అర్చిస్తున్నారు.
 
శుక్రవారఅభిషేక ప్రియ.. గోవిందా 
మార్జాల కిశోర న్యాయ సంవిధాత.. గోవిందా
 
ఓం నమో వేంకటేశాయ.
 

చిత్తూరు జిల్లా : నారాయణవనం

🛕🔔🛕🔔🛕🔔🛕🔔🛕🔔🛕

 

🔅కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం: నారాయణవనం 

 కలియుగ దైవం వేంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైబోగం. అలాంటి కలియుగ నాధుని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది. సాక్షాతూ శ్రీ ఏడుకొండల వాడు "ఎరుకలసాని " గా తిరుగాడిన పవిత్రమైన తిరువీదులు ఉన్న పురం నారాయణవనం . లోకకళ్యాణం కోసం పద్మావతి శ్రీనివాసులు భూలోకం లో పరిణయమాడిన స్థలం ఈ నారాయణవనం.
      
తిరుమల యాత్ర లో తప్పక దర్శించాల్సిన ఈ ఆలయ ప్రాంగణం లోనే ఆనాడు ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవం గా జరిగింది.
 
🔅 స్థలపురాణం : శ్రీ వేంకటేశ్వరుని మామగారైన ఆకాశరాజుకు పిల్లలు లేకపోవటంతో పుత్రకామేష్టి యాగం చేశాడట. పొలాన్ని నాగలితో దున్నుతుంటే నాగలికి ఓ పెట్టె అడ్డుతగిలింది. దానిని తెరచి చూడగా అందులో ఒక ఆడ శిశువు ఉందట. ఆ శిశువుకు పద్యావతి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆకాశరాజు దంపతులు.
తరువాత క్రమంలో వైకుంఠం నుండి బృగ్నుమహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భూలోకానికి రావటం. వకుళమాత ఆశ్రయంలో శ్రీనివాసుడుగా ఉండటం జరుతుంది.  కలియుగంలో శ్రీనివాసునిగా శ్రీమహావిష్ణువు భూమిపై అవతరించాడు . ఆకాశరాజు కుమార్తె పద్మావతి , సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి . వకుళమాత పుత్రుడు శ్రీనివాసుడు . అవతార పురుషుడు . వీరిరువురికీ కళ్యాణం జరిపించాలి వకుళమాత .  ఆమె సన్యాసిని , ఆశ్రమవాసి . నాగరికతకు దూరంగా ఉంది .  శ్రీనివాసునితో పద్మావతీ దేవి పరిణయం జరిపించి తరించిందా పుణ్యమూర్తి . ఆ కళ్యాణానికి సకల దేవగణాలతో దేవదేవేరులందరూ విచ్చేశారు . ఆ మహాదానంద ఘటన జరిగింది  నారయణవనంలో .
 
👉 గ్రామానికి వన్నె తెచ్చేలా పుణ్య అరుణానది ఈ ప్రాంతాన్ని పవిత్రం చేస్తుంది  శ్రీవేంకటేశుని భక్తాగ్రణ్యునిగా చెప్పబడే శ్రీ తండమాన్ చక్రవర్తి స్వయంగా ఈ నగరాన్ని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మింపజేశాడన్నది చారిత్రక సత్యం .
 
👉గర్భాలయంలో కళ్యాణ వేంకటేశ్వరుని మూర్తి అత్యంత సుందరంగా వుంది . శ్రీనివాసుడు పద్మావతిని ఇక్కడే చూశాడన్న ఇతిహాసాన్ని నిజం చేసేలా చేతిలో విల్లు ధరించి వుంటాడు .
ఇక్కడి మూల విరాట్టు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి ఉంటారు. ప్రాంగణం లోపల పద్మం లో కుర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.
 
👉 కళ్యాణం జరిపించుకొంటున్న ఈ పెండ్లికొడుకు సర్వలంకార భూషితుడై , సుందరకారుడై భక్తజనులను తన చల్లని చూపులతో ఆదరిస్తుంటాడు . శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులు గర్భాలయంలో వేంచేసివున్నారు . గర్భాలయ  ముఖద్వారం వద్ద నాలుగు చేతులతో ఆయుధాలు ధరించిన ద్వారాపాలకుల విగ్రహాలు రమణీయంగా వున్నాయి . ముఖ్యంగా ఈ ఆలయంలో గమనించవలసిన విషయం ఒకటుంది . గర్భాలయం అంతరాళం , ముఖమండపానికంటే ఎత్తులో వుంది . 
 ఇక్కడ తిరుమల ఆలయానికి , శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరాలయాలకు భిన్నంగా లక్ష్మీదేవికి ప్రత్యేకంగా మందిరం వుంది . 
 
👉నారయణవనంలో అమ్మవారి ఆలయం ముందు " భాగంలో " పెద్ద తిరగలి " ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ . శ్రీనివాసుని కళ్యాణ సమయంలో ఈ తిరగలిని ఉపయోగించారన్నది ఇక్కడి పౌరాణిక ఐతిహ్యం .  అమ్మవారికి నలుగు పెట్టటానికి నున్నుపిండి కోసం ఈ తిరగలిని ఉపయోగించినట్లు చెబుతారు.
 
👉 ఆలయ ప్రాంగణంలోనే దక్షిణం వైపు వరదరాజ స్వామి ఆలయం వుంది . ఉత్తరం వైపున మరిన్ని దేవతా మూర్తులున్నాయి . ఆలయానికి వెనక వైపున కోనేరు వుంది . ఆనాటి రాజ్య కైంకర్యాలతో ఆలయం శోభించిందని చాటిచెప్పే ప్రతీక ఈ సరోవరం మధ్యలో నిరాళిమండపం , మనకు కనువిందుచేస్తుంది . కళ్యాణ వేంకటేశుని ఆలయానికి కొద్ది దూరంలోని సొరకాయల స్వామి ఆలయాన్ని తప్పక చూడాలి . ఇక్కడ నిరంతరాయంగా వెలుగుతున్న హోమగుండం లోని విభూతిని ధరాణచేస్తే అనేక విధాల పీడలు తొలగిపోతాయన్నది స్థానిక ప్రజల నమ్మకం .
 
👉పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు, లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రార్ధిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుంది అని ప్రతీతి.
కేవలం దర్శన మాత్రముచే వివాహం, సంతానం, ఐశ్వర్యం అందించే నారాయణపురం లోని శ్రీ పద్మావతి కళ్యాణ వేంకటేశ్వరస్వామి
 
👉 ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు 1967 నుండి తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి . ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు జాతర జరుగుతింది . 
అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది . • 
 
👉ఆలయ ప్రాంగణంలో ఇతర ఆలయాలు : 
🔅శ్రీ పరాశర స్వామివారి గుడి • 
🔅శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి •
🔅శ్రీ శక్తివినాయక గుడి 
👉 ప్రధాన దేవాలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నాయి. అవి : 
🔅శ్రీ అగస్త్యేశ్వరస్వామి గుడి .
🔅శ్రీ పద్మావతి అమ్మవారు గుడి •
🔅శ్రీ ఆండాళ్ అమ్మవారి గుడి •
 🔅శ్రీ సీత లక్ష్మణ సమేత రాములవారి గుడి • 
🔅శ్రీ రంగనాయకులవారి గుడి . •
🔅శ్రీ అవనాక్షమ్మ గుడి
 

🪔శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు..?ఆంతర్యం ఏంటి..?🪔

ఆంద్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం  వెలసింది. ఇక్కడికి స్వామి వారి సేవకై భక్తులు ప్రతిరోజూ తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి వారి మొక్కులు తీర్చికోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు. గోవిందా గోవిందా అనే నామంతో పరమ పవిత్రం అయింది తిరుపతి. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా చాలవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం మీకు తెలుసా. ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా... ఆలస్యం చేయకుండా చదివేయండి.
 
శ్రీవారి భక్తులలో అగ్రగణుడు అనంతాళ్వారు. ఆ శ్రీవారికి సేవచేస్తూ తరించిన బక్తుడు శ్రీ అనంతాళ్వార్‌. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు. పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని, మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.
 
ఆమె మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోతాడు.
 
ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారు కు చెప్తారు. దాంతో కంగారు గా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధనుండి ఉపసమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటినుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని చూడాలి అనికుంటే  మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు.🙏🏻
 
🌺లోకాసమస్తా సుఖినోభవంతు,శుభోదయం🌺
 

🕉  ఏడు కొండలు  🕉

💠 తిరుమలకు కాలిబాటన నడిచివెళ్ళే భక్తులు ఏడుకొండలవాడా ! వెంకటరమణా !గోవిందా !గోవిందా ! అని ఎలుగెత్తి కీర్తించడం అందరికి తేలిసిందే.అయితే ఈ ప్రసిద్ది ఎప్పటినుండి వచ్చిందో కచ్చితంగా తేలియదు .ఏడుకొండలలో ఒక్కో కొండకు ఒక్కో నామం ఉంది .ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర కూడను వుంది
 
💠 ఇందులో మొదటిది శ్రీశైలం .
ఇది ఇంచుమించు తమిళంలోని తిరుమలై అనే మాటకు సరిపోయ్ పదభందం .
తిరు మంగళవాచకం .మలై అంటే కొండ .శ్రీదేవి నివసిస్తుండడం వల్ల ,భక్తులకు శ్రీప్రదం కావడం వల్ల శ్రీశైలమనే పేరు వచ్చింది.
 
💠 రెండవది శేషశైలం .
శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వతరూపాన్ని ధరించడం చేత  శేషశైలం శ్రీమహావిష్ణువు వాయువుకు శేషునికి పందెం పెట్టగా ,శేషుడు వెంకటాద్రిని ఆవరించగా ,వాయువు మహావేగంతో వీచగా ,శేషుడు సువర్ణముఖరీతీరం  దాకా కదిలిపోగా ,స్వామి ఆజ్ఞతో వేంకటాద్రి విముక్తం కావడంతో ,శేషుడు తపం అవరించడం వల్ల శేషపర్వతఖ్యాతి వచ్చింది .
 
💠 మూడవది గరుడాచలం .
శ్వేతవరాహ కల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మoతుడు శ్రీ వైకుoటము నుండి ఈ పర్వతం తీసుకురావడం వల్ల గరుడాచలం.
 
💠 నాల్గోవధి వేంకటాద్రి . 
వేo కారానికి అమృతమని అర్ధం .కటం అంటే ఐశ్వర్ర్యం.ఆశ్రితులకు అమృతాన్ని ,ఐశ్వర్ర్యంన్ని ప్రసాదించే కొండ అని అభిప్రాయం .లోకంలోని పాపాలకు వేoఅని వ్యవహారం .ఆ పాపాలను ధహించగాలది కావడం వల్ల వెంకటశైలం.
 
💠 ఐదవది  నారాయణాద్రి .
సాక్షాత్ శ్రీ మన్నానారాయణుడే వాసం చేయడం వల్ల నారాయణాద్రి నారాయణుడనే విప్రుని ప్రాద్దన మన్నిoఛి శ్రీనివాసుడు వాసం చేయడం నారాయణాద్రి.
 
💠 ఆరవధి వృషభాద్రి .
వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయాగా ,తన పేరుతో పర్వతం పిలువబడాలని కోరగా శ్రీనివాసుడు  అనుగ్రహించడం వల్ల వృషబాద్రి.
 
💠 ఇక చివరది వృషాద్రి.
వృష శబ్దానికి ధర్మమని అర్ధం .తన అభివృద్ధికోసం .ఈ కొండ మీద ధర్మదేవత తపస్సు చేయడం వల్ల వ్రషాద్రి.
 
💠 ఒక్కక యుగంలో ఈ కొండలన్నిటికీ ఒక్కక పేరు ప్రసిద్దంగా వుండేది .
వరాహపురాణం ప్రకారం కృత యుగంలో అంజనాద్రి ,
త్రేతా యుగంలో నారయణగిరి ,
ద్వాపరయుగంలో సింహశైలం ,
కలియుగంలో వెంకటాచలం .
 
💠 బవిషోత్తర పురాణం ప్రకారం ..
కృతయుగంలో వృషాద్రి ,
త్రేతాయుగంలో అంజనాచలం ,
ద్వాపరయుగంలో శేషశైలం ,
కలియుగంలో వెంకటచలం అని పేర్లు.
 
💠 ఇవే కాక చింతామణి, జ్ఞానద్రి, తిర్దాద్రి, పుష్కరాద్రి, ఆనందాద్రి, నీలాద్రి, నరసింహాద్రి, వరహాద్రి, వైకుంటద్రి, శ్రీ పర్వతమనే పేర్లు ఉన్నాయి .
తమిళ సాహిత్యంలో తిరువేoగడం అనే మాటకు ప్రాచుర్యం అర్ధం .
వేంగి +కడం -వేంగి రాజ్యానికి చివరున్న ప్రదేశం కావడంవల్ల వేంగడం.
 
💠 ఏడుకొండల మీద వేంకటేశ్వరుడున్నాడు .ఇందులో మరొక అధ్యాత్మికత రహస్యం ఉంది .
శరీరంలో ఏడు చక్రలున్నాయి .మూలధారం ,స్వాధిష్టనం,మణిపూరకం ,అనాహతం ,విశుద్దం ,ఆజ్ఞ ,సహాస్రారం -అని ,అధోముఖమయిన కుండలిని శక్తిని యోగాబ్యాసంతో సహస్రారానికి పయనిoపజేయడం పరమాత్మ  సాక్షాత్కరానికి మార్గమని అంటారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 

🌷ఆనంద నిలయం శ్రీ వేంకటాచలం🌷

భక్తుల పాలిట అదో ఆనంద నిలయం  ఆ పవిత్ర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఓ తీయని ఆధ్యాత్మిక భావన భక్తులను భక్తిభావంలో ముంచెత్తుతుంది.
 
   కలియుగ వరదుడి దర్శనం అయ్యేంత వరకూ ఓ పవిత్రమైన అనుభూతి మనసంతా నిండిపోతుంది. సప్తగిరుల మధ్య కొలువై వున్న వేంకటేశ్వరుని మహిమ అంత గొప్పది కనుకనే
 
   ఏడుకొండలు ఎక్కి భక్తులు  వెల్లువలా తరలివస్తారు  స్వామి సేవలో తరిస్తారు. అలాంటి స్వామి మహిమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే.
 
  వేంకటాద్రి సమ స్థానం బ్రహ్మాండే నాస్తి కించన , వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి.
 
    అంటే ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. ఆ శ్రీనివాసునికి సాటి రాగల దేవుడు భూత కాలంలో లేడు , 
 
  భవిష్యత్తు కాలంలోనూ ఉండబోడని అర్థం. ఆ ప్రశస్తికి నిలువెత్తు నిదర్శనం ఈ ఏడుకొండలు. శ్రీనివాసుడి దర్శనభాగ్యం మాత్రాన్నే భక్తుల్లో నిండుకొచ్చే భక్తిభావం  అది మాటలకందదు.
 
 స్మరణాత్సర్వ పాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనాన్ముక్తిదం చేదం శ్రీనివాసం భజేన్నిశమ్ అంటారు.
 
( అంటే ఆ దేవదేవుడిని స్మరిస్తే చాలట పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఆ లక్ష్మీవల్లభుడిని కీర్తిస్తే చాలట మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయట.
 
   ఆ కమలనాభుడిని కనులారా దర్శిస్తే చాలట  మోక్షప్రాప్తి సిద్ధిస్తుందట. ఓం నమో వేంకటేశాయ నమః అని మనసులో తలుచుకుంటే చాలట  ఏడేడు జన్మల్లో చేసిన పాపాలు మనల్ని అంటవట.)
 
 అంతటి మహత్యమున్న ఏడుకొండలు  ఈ సప్తగిరులు  ఈ తిరుమల క్షేత్రం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు.
 
 ఇంతటి మహత్తు కలిగిన దేవదేవుడు  కలియుగ వరదుడు శ్రీదేవి , భూదేవి సమేతుడైన వేంకటేశ్వరుడు భూమండలంలో ఉండడు.
 
అందుకే నారాయణనామ సంకీర్తనం యస్య తస్య పాప ప్రణాశనమ్ అంటుంది భాగవతం. 
 
  కలియుగంలో శ్రీహరి సంకీర్తనతో సర్వ పాపాలు నశించిపోతాయి. అందుకే కలౌ సంకీర్త్య కేశవమ్ అని అన్నారు.
 
 యజ్ఞయాగాది క్రతువులకు కలియుగంలో ప్రాధాన్యం లేదు. నిర్మలమైన హృదయంతో ఆ సప్తగిరీశుడిని నోరార కీర్తించగలిగితే చాలు.సర్వం కరతలామలకం.
 
   అందుకే పద కవితా పితామహుడు , వాగ్గేయకారుడు. వేంకటేశ్వరుని వేలమార్లు జపించాడు. వేనోళ్ల కీర్తించాడు. "అన్నిమంత్రములు ఇందే అణగియుండెను.వెన్నతోడబెట్టి నది వెంకటేశుమంత్రము."-అంటూ
 
   అన్ని మంత్రముల సారం ఏడుకొండల్లోనే ఉందని చాటి చెప్పాడు. పరబ్రహ్మ మంత్రమైన వేంకటేశ్వరుడి మంత్రాన్ని జపించాడు... కలియుగ వరుదుడిని కంటి నిండా చూసి తరించాడు.
 
   ఆ వేంకటేశ్వర మంత్రాన్ని సంకీర్తనలో గానం చేయడంలో అంత బలముంది. అంతటి మహత్తు ఉంది.
మీరుకూడా ప్రయత్నించండి.ఇదిచాలాసులభం.సుకరం .
 
  పాపాలను నశింపజేయువాడే. వేంకటేశుడు.  వేం అంటే పాపాలను , కట అంటే నాశనం చేసేవాడని,వేంకటటేశ్వర శబ్దానికి అర్ధం. 
 
 అందుకే దానికి వెంకటాద్రి అన్న పేరు సార్థకమైందని చెబుతుంటారు. అందుకే వేంకటాచలం పరమ పవిత్రమైన పుణ్యస్థలం.
 
   తిరుమల కొండ అంత సామాన్యమైనదేమీ కాదు.  ఆ ఏడుకొండలకు , వేంకటేశునికి తెలియని బంధం ఉంది. 
 
    ఒక్కోయుగంలో ఒక్కో పేరుతో పిలవబడుతున్న ఈ కొండను త్రేతాయుగంలో అంజనాచలమని , కృతయుగంలో వృషాచలమని , కలియుగంలో వేంకటాచలమని కొలుస్తున్నారు. యుగాలు మారిన కొండ మాత్రం తరగలేదు.
 
   ఎందుకంటే వేంకటాద్రి వేంకటశుని క్రీడా స్థలం. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం....ఓం నమో వేంకటేశాయ..
 

శ్రీవారికి సేవచేసే అరుదైన భాగ్యం ఈయనకు దక్కింది.. ఇంతకీ మణి ఏం చేస్తారో తెలుసా..?

శ్రీవారు కొందరికి అరుదైన సేవ భాగ్యాన్ని వివిధ రూపాల్లో అందిస్తూ ఉంటారు. కనివిని ఎరుగని రీతిలో స్వామి వారి సేవ భాగ్యం ఓ సాధారణ టైలర్ కు లభించింది. స్వామి వారి ముందు నిలబడే పరదాలు., కురాలాలు తాయారు చేసే భాగ్యం ఆయనకు దక్కింది.
 
తిరుపతిలోని తీర్థకట్ట వీధిలో సాధారణ టైలర్ వృత్తి చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు మణి. పరదాలు తాయారు చేయడంలో అద్భుతమైన కళానైపుణ్యం కలిగిన వ్యక్తి. 1999లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటుకు బట్టలతో తయారు చేసిన హుండీని తయారు చేసారు.
 
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని (Sri Venkateswara Swamy) ఒక్క సారి దర్శించుకుంటేనే పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాం. అలాంటిది శ్రీవారి ఆలయంలో కైకర్యాలు నిర్వహించే అర్చకులది ఎన్ని జన్మల పుణ్యఫలమో అంటూ అనుకుంటాం. శ్రీవారు కొందరికి అరుదైన సేవ భాగ్యాన్ని వివిధ రూపాల్లో అందిస్తూ ఉంటారు.
 
కనివిని ఎరుగని రీతిలో స్వామి వారి సేవ భాగ్యం ఓ సాధారణ టైలర్ కు లభించింది. స్వామి వారి ముందు నిలబడే పరదాలు., కురాలాలు తాయారు చేసే భాగ్యం ఆయనకు దక్కింది. నెల రోజుల పాటు దీక్ష చేసి... ఆ దీక్షలో స్వయంగా తన చేతితోనే పరదాలు., కురాలాలు తాయారు చేస్తారు. ఏడాదికి నాలుగు సార్లు శ్రీవారికి ఈ పరదాలు., కురాలాలు అందించే భాగ్యం ఆయన సొంతం
 
అమ్మ చల్లని కరుణ., అయ్యవారికి చేరింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నాడు పరదాలు తాయారు చేయాలనీ టీటీడీ నుంచి వచ్చిన ఆదేశాలతో శ్రీవారికి పరదాలు తయారు చేయడం ప్రారంభించాడు
 
ఆలా గత 24 ఏళ్లుగా స్వామి వారి ఆలయానికి పరదాలు, కురాలాలు సమర్పిస్తున్నారు మణి. స్వామి వారికీ పరదాలు సమర్పిస్తుండటంతో అప్పటి నుంచి సాధారణ మణి కాస్త పరధాల మణిగా బిరుదు ఇవ్వడం విశేషం.
 
స్వామి వారి గర్భాలయంలో ఉన్న జయవిజయ ద్వారా పాలకుల ద్వారం వద్ద గరుడ వాహన భూషితుడైన శ్రీ వేంకటేశ్వరుడు, కామధేనువు, పరదాలపై భాగంలో శ్రీ పద్మావతి, లక్ష్మీదేవి అమ్మవార్లు, శ్రీవారి తిరునామంతో ఎంతో విశేషంగా ఆ పరదాలను రూపొందించారు. ఇక రాముల వారి మెడకు శ్రీ లక్ష్మి దేవి అమ్మవారి ప్రతిమ, ఐరావతం, శంఖు చక్రాలు అమర్చారు. ఇక కుల శేఖర పడి వద్ద పద్మావతి అమ్మవారు., తిరునామం వచ్చేలా రూపకల్పన పరదాలపై చేసారు.
 
స్వామి వారి గర్భాలయంలో ఉన్న జయవిజయ ద్వారా పాలకుల ద్వారం వద్ద గరుడ వాహన భూషితుడైన శ్రీ వేంకటేశ్వరుడు, కామధేనువు, పరదాలపై భాగంలో శ్రీ పద్మావతి, లక్ష్మీదేవి అమ్మవార్లు, శ్రీవారి తిరునామంతో ఎంతో విశేషంగా ఆ పరదాలను రూపొందించారు. ఇక రాముల వారి మెడకు శ్రీ లక్ష్మి దేవి అమ్మవారి ప్రతిమ, ఐరావతం, శంఖు చక్రాలు అమర్చారు. ఇక కుల శేఖర పడి వద్ద పద్మావతి అమ్మవారు., తిరునామం వచ్చేలా రూపకల్పన పరదాలపై చేసారు.
 
మూడు రకాల పరదాలు., రెండు కురాలాలు ప్రతి ఏటా నాలుగు సార్లు స్వామి వారికి సమర్పించడం చాల సంతోషాన్ని ఇస్తుంది. స్వామి వారి గర్భాలయంకు అనుకోని ఉన్న కులశేఖర పడికి., రాముల వారి మేడకు., జయవిజయ ద్వారాలకు మూడు పరదాలు., స్వామి వారికి మరో రెండు కురాలాలు సమర్పిస్తాం
 
పరదాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంకు ముందు వచ్చే సోమవారం నాడు సిద్ధం చేసుకుంటాం. అనంతరం కాలిబాటగా తిరుమలకు చేరుకొని పవిత్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి.. వరాహ స్వామి దర్శనం చేసుకుంటాం.
 
మంగళవారం నాడు జరిగె కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నాడు స్వామి వారికీ పరదాలు., కురాలాలు అందించడం ఆనవాయితీ. అంత స్వామి వారే నడిపించి నాకు ఈ భాగ్యాన్ని కల్పిస్తున్నారని నా ప్రగాఢ విశ్వాసం" అని పరదాల మణి చెప్పారు.

 

శ్రీవారి ఆలయ నిర్మాణం..

క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.
 
శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు  ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి.
 
ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి
 
1 వ ప్రాకారం :-
మహాద్వార గోపురం  :- (ఇత్తడి వాకిలి)*
 
శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే .... ప్రధాన ప్రవేశద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం.
పడికావలి, సింహద్వారం, ముఖద్వారం
అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. 
దీనినే తమిళంలో ”పెరియ తిరువాశల్‌” అని కూడా అంటారు. అనగా *పెద్దవాకిలి అని అర్థం.
 
ఈ ప్రధాన ద్వార గోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.
 
ఇక్కడే మనం క్రింద ఉన్న పైపుకు గల రంధ్రాల ద్వారా వచ్చే నీటితో కాళ్ళు  కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.
 
ఈ వాకిలి దక్షిణవైపున గోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం  ఉంటుంది.
 
శంఖనిధి - పద్మనిధి
మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉంటాయి. వీరే శ్రీవేంకటేశ్వరుని సంపదలకు నవనిధులను రక్షించే దేవతలు.  దక్షిణదిక్కున ఉన్న రక్షక దేవత రెండుచేతుల్లోనూ రెండు శంఖాలు ఉంటాయి ఈయన పేరు శంఖనిధి, కుడివైపున ఉన్న రక్షకదేవత చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి ఈయన పేరు పద్మనిధి.
 
*కృష్ణదేవరాయమండపం :-
 
మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో 27' ×25' కొలతలు ఉన్న ఎతైన మండపమే కృష్ణరాయ మండపం. దీనినే ప్రతిమా మండపం అని కూడా అంటారు. 
 
ఈ మండపం లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో  కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉన్నాయి.
 
అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ ప్రక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు.
 
అద్దాలమండపం
 
ప్రతిమా మండపానికి 12 అడుగుల దూరంలో, ఎతైన అధిష్టానంమీద నిర్మింపబడి ఉన్న దీన్నే అద్దాలమండపమని
 అయినామహల్ అని అంటారు. 43'×43' కొలతలున్న ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు ఒకప్పుడు. ఈ అరల ప్రాంతాన్నే ప్రసాదం పట్టెడ అంటారు.
 
తులాభారం :-
 
శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణ గాని తులాభారంగా శ్రీస్వామివారికి సమర్పిస్తారు.
 
రంగనాయక మండపం  :-
 
కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో అనల్ప శిల్ప శోభితమై విరాజిల్లుతూ ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.
 
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.
 
తిరుమలరాయమండపం:-
 
రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాలు, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి మచ్చుతునక ఈ తిరుమలరాయ మండపం. 
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించాడు (సాళ్వ నరసింహ మండపం). శ్రీస్వామి వారికి "అన్నా ఊయల తిరునాళ్ళ" అనే ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం క్రీ.శ. 1473 లో ఈ మండపం నిర్మించాడు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు.
అణ్ణై అనగా తమిళంలో హంస.🕊 బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.
 
*రాజ తోడరమల్లు:-
 
ధ్వజస్తంభం మండపానికి 10 అడుగుల దూరంలో స్వామి వారికి నమస్కరిస్తున్నట్లు 3 విగ్రహాలు ఉంటాయి. సహజంగా కళ్యాణం ముగించుకున్న భక్తులు సాధారణ భక్తులతో కలిసే మార్గంలో ఉంటాయి.
 అవి రాజా  తోడరమల్లు
అతని తల్లి మోహనాదేవి
అతని భార్య పితాబీబీ విగ్రహాలు. 
ఈయన అనేక సంవత్సరాలు తిరుమలను దుండగుల బారినుండి రక్షించారు.
 
*ధ్వజస్తంభ మండపం :-
 
ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం  అంటారు. 
 
ధ్వజస్తంభం:-*
 
వెండివాకిలి ఎదురుగా సుమారు15 అడుగుల దూరంలో చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంవలెనున్న ఎతైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం.
 
బలిపీఠము :-
 
ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని (అన్నాన్ని ) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.
 
క్షేత్రపాలక శిల (గుండు) :-
 
ధ్వజస్తంభం కు ఈశాన్య (north - east)  మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే క్షేత్రపాలక శిల అంటారు.
ఇది రాత్రిపూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడికితాళం వేసి తర్వాత ఈ శిలపై ఉంచి నమస్కరించి మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులను తీసుకువెళతారు.
 
సంపంగి ప్రాకారం  :-
 
మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం సంపంగి.  ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.
 
కళ్యాణ మండపం  :-
 
సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటు చేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి వారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది.
 
*ఉగ్రాణం :-
 
స్వామివారి పూజా సంభారాలు నిల్వ ఉంచేగది.
సంపంగి ప్రదక్షిణకు  (north west)  వాయువ్య మూలగా ఉంటుంది.
 
విరజానది :-
 
వైకుంఠంలోని పరమ పవిత్రమైన నది శ్రీవారి పాదాలక్రిందగా ప్రవహిస్తూ ఉంటుందని నమ్మకం.
 
ఆలయం లోపలి బావులలో ఈనది నీరు ప్రవహిస్తుందని అందుకే ఆలయ బావులలోని నీరు పరమ పవిత్రమైనవిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వాడతారు.
 
నాలుగు స్థంభాల మండపం :-
 
సంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వ నరసింహ రాయలు ఆయన భార్య , ఇద్దరు కుమారులు పేర స్థంభాలు కట్టించాడు.
 
పూలబావి :-
 
పూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామి వారికి ఉపయోగించిన పూల నిర్మాల్యాలన్నీ ఇందులో వేస్తారు.
దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్ళేటపుడు ఎత్తైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.
 
వగపడి :-
 
భక్తులు సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది.
 
ముఖ మండపం :-
 
అద్దాల మండపంనకు ముందుభాగంలో ఉంటుంది.
కళ్యాణం చేయుచుకున్న భక్తులకు ప్రసాదాలు దీని ప్రక్కమార్గంలో అందచేస్తారు.
 
 2 వ ప్రాకారం :-
 
వెండి వాకిలి – నడిమి పడికావలి...
 
ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామి వారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశ ద్వారమంతటా వెండి రేకు తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు. 
ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న  శిల్పం ఉంది.
 
విమాన ప్రదక్షిణం :-
 
వెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అనికూడా అంటారు. సుప్రభాత సేవ జరిగేటపుడు వెలుపల అంగప్రదక్షిణం చేసే భక్తులు కూడా ఉంటారు.
 
ఈ ప్రదక్షిణ మార్గంలో  వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాధ స్వామి, వరదరాజస్వామి, ప్రధానవంటశాల,
పూలబావి,
అంకురార్పణ మండపం,
యాగశాల,
నాణాల పరకామణి,
నోట్ల పరకామణి,
చందనపు అర
విమాన వేంకటేశ్వర స్వామి,
రికార్డుల గది,
భాష్యకారుల సన్నిధి,
యోగనరసింహస్వామి సన్నిధి,
ప్రధాన హుండి
విష్వక్సేనుల వారి ఆలయం
మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్ళుగా పేర్కొంటున్నారు.
 
శ్రీరంగనాథుడు :-
 
వెండి వాకిలి గుండా లోపలకు ప్రవేశించగానే ఎదురుగా ఆదిశేషునిపైన కనిపించేది శ్రీరంగనాథుడు. ఈయనకు పైన వరదరాజస్వామి క్రింద వెంకటేశ్వరస్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటాయి.
అంగప్రదక్షిణం ఇక్కడి నుంచే మొదలవుతుంది.
వీనినే పొర్లుదండాలు అంటారు.
 
శ్రీ వరదరాజస్వామి ఆలయం :-
 
విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో (సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామి వారి శిలామూర్తి ప్రతిష్ఠింపబడింది.
 
బంగారు బావి :-
 
దర్శనానంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడంతో ఉంటుంది. ఇందులోని నీటినే స్వామి వారి అభిషేకాలకు ప్రసాదాలకు వాడతారు. ఇందులో వైకుంఠం లోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనది గా చెపుతారు.
 
వకుళాదేవి :-
 
బంగారుబావి ప్రక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది.
శ్రీవారి తల్లి (పెంచిన). ద్వాపరయుగంలో యశోదయే ఈ కలియుగంలో స్వామి వారి కళ్యాణం చూడడానికి వకుళాదేవిగా అవతరించింది.
 
అంకురార్పణ మండపం :-
 
బంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు.
ఇంకా గరుడ, విష్వక్సేనుల, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.
 
యాగశాల :-
 
హోమాది క్రతువులు నిర్వహించే ప్రదేశం. కాని ఇప్పడు సంపంగి ప్రాకారంలోని  కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.
 
సభ అర :-
 
కైంకర్యాలకై ఉపయోగించే బంగారు వెండి పాత్రలు కంచాలు గొడుగులు ఉంచే ప్రదేశం.
 
ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విశనకర్రలను కూడా ఇక్కడే భద్రపరుస్తారు.
 
సంకీర్తన భాండాగారం :-
 
సభ అర ప్రక్కనే ఉన్న గది. దీనికి ఇరువైపులా తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్ళపాక వంశం వారు రచించిన దాదాపు 32000 సంకీర్తనలను భద్రపరిచారు.
 
సాధుసుబ్రమణ్యశాస్త్రి* గారి విశేష కృషి వలన ఈనాడు మనం వాటిని మననం చేసుకోగలుగుతున్నాము.
 
భాష్యకార్ల సన్నిధి :-
 
ఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు గారి విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏం ఏం కైంకర్యాలు ఏవిధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి.
 
తన 120 సం.ల కాలంలో 3 పర్యాయాలు తిరుమలకు మోకాళ్ళ మీద వచ్చాడు. అలా వస్తున్నపుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ళ పర్వతం.
 
ఈనాటికి కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం గమనించవచ్చు.
 
ప్రధాన వంటశాల (పోటు) :-
 
విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.
 
పరకామణి :-
 
స్వామి వారికి భక్తులు సమర్పించిన నగదు లెక్కించే ప్రదేశం.
 
చందనపు అర :-
 
స్వామి వారికి సమర్పించే చందనాన్ని భద్రపరిచే ప్రదేశం.
 
ఆనందనిలయ విమానం :-
 
ఆనందనిలయం పైన ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు.
 
గరుత్ముంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుండి భూమిమీదకు తీసుకు వచ్చారని చెప్తారు. దీనిమీద దాదాపు 64 మంది దేవతా ప్రతిమలు ఉన్నట్లు చెపుతారు.
 
విమాన వెంకటేశ్వరస్వామి :-
 
గోపురంపై  వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామివారు. 
 
రికార్డు గది :-
 
స్వామి వారి ఆభరణాలు వివరాలు, జమ ఖర్చులు భద్రపరచు గది.
 
వేదశాల :-
 
రికార్డు గది ప్రక్కనే వేద పఠనం చేసే పండితులు ఉండేగది. ఇక్కడే మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.
  
 
శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి :-
 
రామానుజాచార్యులుచే ప్రతిష్టితం చేయబడింది.
 
శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం. క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. 
'అళగియ సింగర్‌' (అందమైన సింహం) అని, వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది.
 
చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండడం ప్రత్యేకం.
ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.
 
శంకుస్థాపన స్థంభం :-
 
రాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.
 
పరిమళ అర :-
 
శంకుస్థాపన స్థంభంకు వెళ్ళే దారిలో ఉంటుంది. స్వామి వారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.
 
శ్రీవారి హుండి :-
 
భక్తులు కానుకలు వేసే ప్రాంతం.
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగిననూ మార్పు చెందని ఒకేఒక స్థలం. దీని క్రింద శ్రీచక్రయంత్రం ధనాకర్షణ యంత్రం ఉందని నమ్మకం.
 
బంగారు వరలక్ష్మి :-
 
హుండి ఎడమగోడపై బంగారు లక్ష్మీ దేవి విగ్రహం కలదు. ఈవిడ భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.
 
కటహ తీర్థం :-
 
అన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టి లాంటి నిర్మాణం. ఇందులో స్వామి వారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.
 
విష్వక్సేన :-
 
హుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ప్రస్తుతం ఈ విగ్రహం అంకురార్పణ మండపంలో ఉంది.
 
ఘంట మండపం :-
 
బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామి వారి సందర్శనకు వేచిఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు.
 
పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు. దీనిని ఘంటపని అనేవారట. ఈ గంటలననుసరించే స్వామి వారి ఆహారసేవనలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం సేవించేవారట.
 
ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.
 
గరుడ సన్నిధి :-
 
మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారులు గారు ఉన్న మండపం. బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. ఈ మందిరానికి వెలుపల అంతటా  బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.
 
ద్వారపాలకులు :-
 
బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.
మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.
 
3 వ మూడవ ప్రాకారం :-
 
బంగారువాకిలి :-
 
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.
 
స్నపన మండపం :-
 
బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమంపం’. క్రీ.శ. 614 లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే తిరువిలాన్‌కోయిల్‌ అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.
 
ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునకు ఆరోజు పంచాంగం, చేయవలసిన పూజాదికాలు, క్రితంరోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు.
 
దీనిలో కుడివైపున అనగా దక్షిణ దిక్కున హుండీ మరియు ఎడమవైపున అనగా ఉత్తర దిక్కున శ్రీవారి ఆభరణాలు భద్రపరిచే గది ఉంటాయి.
 
రాములవారి మేడ :-
 
స్నపనమండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపుల  ఎత్తుగా కనిపించే గద్దెలు. ”రాములవారిమేడ”. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. 
ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.
 
శయనమండపం  :-
 
రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి  శయనిస్తారు.
 
కులశేఖరపడి :-
 
శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి. 
 
పడి అనగా మెట్టు, గడప అని అర్థం.
 
 ఆనందనియం  :-
 
కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ” గర్భాలయం ”  అనికూడా అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.
 
శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) :-
 
గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”స్థానకమూర్తి” అంటారు.
అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”.... ధ్రువమూర్తి ....” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.
 
శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల స్వయంభూమూర్తి. 
 
ఈ మూలమూర్తికి ప్రతినిధులు గా 
కొలువు శ్రీనివాస మూర్తి
భోగ శ్రీనివాస మూర్తి
ఉగ్ర శ్రీనివాస మూర్తి
మలయప్ప స్వామి
 
అను ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి.
 
ఇంకా 
సీతారామలక్ష్మణులు
శ్రీకృష్ణ రుక్మిణి లు
చక్రతాళ్వారులు
శాలిగ్రామ శిలలు ఉన్నాయి.
(స్వామికి ప్రతిరుపాలుగా వీనికి నిత్య అభిషేకాలు జరుగుతాయి.)
 
ముక్కోటి ప్రదక్షిణం :-
 
రాములవారి మేడ చుట్టూ చేసే ప్రదక్షిణం.
వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశినాడు ఈ ద్వారం గుండా దర్శనం ఉంది.
 

మాడ వీధి అంటే ఏమిటి ?

 
తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు. 
 
తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి 'మాడాం' అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది. ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అందుచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు. శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.
 
 తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి. వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు
 
1.తూర్పు మాడ వీధి.
 
ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి. ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న (ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు
 
ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి. క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా  కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.
 
2. దక్షిణ మాడ వీధి.
 
ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది.దీని పక్కనే - ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట ఈ వీధి మొదట్లో (ఆగ్నేయంలో) 'ఊంజల్ మండపం' ఉంది. ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు. దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది. తిరుమల నంబి గుడి తర్వాత 'ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది.
 
3. పడమర మాడ వీధి.
 
ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు),  కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి. అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.
 
4. ఉత్తర మాడ వీధి.
 
ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది అచ్యుతరాయలు 16 వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి 'అచ్యుతరాయ కోనేరు' అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడనీ అంటారు. ఏది ఏమైనా పుష్కరిణి గానే ప్రసిద్ధి గాంచింది.
 
ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహెబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది. తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి తరిగొండ బృందావనం - ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది.
 
ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు. ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి. వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు.
 
ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ  నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు.