Our Culture & Traditions


 

ఒడిబియ్యం పోయటం వల్ల ఫలితాలు:

🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

🌟 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. . ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో 'ఒడ్డియాన పీఠం' వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో 'వడ్యాణం' అంటారు.
 
🌟 ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటెనే రక్షణ.
 
🌟 ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు.మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే.
 
🌟 సంతోషంతో ఆ మహాలక్ష్మి(ఆడపడుచు), తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి, దేవుని ప్రార్ధించి, మహాధ్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను(ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది.
 
🌟 ఇది అత్తవారు కూడ చేయవచ్చు.....
 
🌟 అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం, సారాంశం తెలుసుకోవాలి అత్యంత నిష్ఠతో చేయాలి.
   

హిందూ వివాహ సంప్రదాయ:

1. కన్యావరణం:
2. పెళ్ళి చూపులు
3. నిశ్చితార్థం:
4. అంకురార్పణం:
5. స్నాతకం:
6. సమావర్తనం:
7. కాశీయాత్ర:
8. మంగళస్నానాలు:
9. ఎదురుకోలు:
10. వరపూజ:
11. గౌరీపూజ:
12. పుణ్యాహవాచనం:
13. విఘ్నేశ్వరపూజ:
14. రక్షా బంధనం:
15. కొత్త జంధ్యం వేయడం:
16. గౌరీ కంకణ దేవతాపూజ:
17. కౌతుక ధారణ:
18. కంకణ ధారణ:
19. మధుపర్కము:
20. వధువును గంపలో తెచ్చుట:
21. తెరచాపు
22. మహా సంకల్పం:
23. కన్యాదానం:
24. వధూవరుల ప్రమాణములు:
25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:
26. స్వర్ణ జలాభిషేకం:
27. చూర్ణిక:
28. వధూవర సంకల్పం:
29. యోక్త్రధారణం:
30. మాంగల్య పూజ:
31. మాంగల్య ధారణ:
32. అక్షతలు-తలంబ్రాలు:
33. బ్రహ్మముడి:
34. సన్నికల్లు తొక్కడం:
35. కాళ్లు తొక్కించడం:
36. పాణి గ్రహణం:
37. సప్తపది:
38. లాజహోమం:
39. యోక్త్రవిమోచనం:
40. స్థాలీపాకం:
41. ఉంగరాలు తీయడం:
42. బొమ్మని అప్పగింత:
43. నాగవల్లి:
44. ధ్రువనక్షత్రం:
45. అరుంధతి నక్షత్ర దర్శనం:
46. అప్పగింతలు:
47. అత్తమామలకు వధువు పూజ:
48. ఫలప్రదానం:
49. పానుపు:
50. మహదాశీర్వచనం:
51. వధువు గృహప్రవేశం:
52. కంకణ విమోచన:
53. గర్భాదానం:
54. పదహారు రోజుల పండుగ
55. అల్లెం.
________
హిందువుల పెళ్లి తంతులో తారసపడే ఘటనలు.
-----------------------------------
 తెలుసుకుంటే మన పిల్లల పెళ్లికి ఉపయోగపడుతుంది.
 

సాష్టాంగ నమస్కారం ....

సాష్టాంగ నమస్కారము లేదా అష్టాంగ నమస్కారం అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయడం అని అర్ధము..
 
ఉరసా శిరసా దృష్ట్యా మనసా
వచసా తథా పద్భ్యాం కరాభ్యాం
కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః..
 
అష్టాంగాలు అంటే.. అవి ఏవి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
 
1. "ఉరసా " అంటే తొడలు అని అర్థం.
 
2. "శిరసా " అంటే తల అని అర్థం.
 
3. "దృష్ట్యా " అనగా కళ్ళు అని అర్థం.
 
4. "మనసా " అనగా హృదయం అని అర్థం.
 
5. "వచసా " అనగా నోరు అని అర్థం.
 
6. "పద్భ్యాం " అనగా పాదములు అని అర్థం.
 
7. "కరాభ్యాం " అనగా చేతులు అని అర్థం.
 
8. "కర్ణాభ్యాం " అంటే చెవులు అని అర్థం.
 
ఇలా మన ఎనిమిది అంగాలతో నమస్కారం చేయాలి. మనం చేసే నమస్కారం ఇలా 8 అంగములతో కూడినదై ఉంటుంది కాబట్టి దాన్ని అష్టాంగ నమస్కారం అంటారు.
 
మానవుడు సహజంగా ఈ 8 అంగాలతోనే తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలేలా నమస్కరించాలి..
 
ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.
 
1) ఉరస్సుతో నమస్కారం చేయడం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.
 
2) శిరస్సుతో నమస్కారం చేయడం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.
 
3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ దేవుని మూర్తిని చూడగలగాలి.
 
4) మనస్సుతో నమస్కారం చేయడం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.
 
5) వచసా నమస్కారం చేయడం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. అంటే "   ఓం నమో భగవతే వాసుదేవాయ అని అంటూ నమస్కారం చేయాలి.
 
6) పద్భ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.
 
7) కరాభ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.
 
8) జానుభ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి..
 
   అయితే ముఖ్యంగా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని మన శాస్త్రం చెబుతుంది. పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు నీకు ఎదురు పడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.. 
 

దేవాలయములో 'మూలవిరాట్టు'గల ప్రదేశాన్ని'గర్భగుడి'అని అంటారు...

 
దేవాలయానికి గర్భగుడి ప్రధానమైనది. గర్భగుడినే మూలస్థానం అంటారు. ఈ మూలస్థానాలన్ని కూడా మన హిందూ ధర్మశాస్త్రంలో ఆగమసూత్రాలను అనుసరించి నిర్మించబడిఉంటాయి
ప్రతి ఆలయంలోను విగ్రహ పరిమాణానికి తగినట్లు గర్భగుడిని నిర్మిస్తారు. ఈ రెండింటికి ఎప్పుడు ఒక నిర్ణీత సంబంధం వుండటంవల్లనే గర్భగుడి లోపల ప్రణవమంత్రం ప్రతిధ్వనిస్తూ వుంటుంది.
ప్రణవమంత్రమైన ఓంకారాన్ని ఉచ్ఛరించినపుడు ప్రతిధ్వని ఏర్పడుతుంది. 
దేవాలయంలో ప్రధాన మందిర ద్వారానికి దక్షిణ గోడలో పట్టికాది స్థానంలో నిక్షేపిస్తారు. కాబట్టి దాన్ని గర్భాలయం లేదా గర్భగుడి అంటారు.
శబ్దాన్ని బట్టి రాయి జాతిని నిర్ణయించి దానిని మూలవిరాట్టుగా మలిచి యంత్ర సహితంగా గర్భాలయములో ప్రతిష్ఠ చేస్తారు. 
ఆలయం ఎంత విశాలంగా ఉన్నప్పటికీ గర్భగుడి మాత్రం చాలా చిన్నదిగా వుంటుంది. ఆలయం బయటంత శిల్ప సంపద, విద్యుత్ కాంతులు కనిపిస్తాయి. 
కానీ గర్భాలయంలో అలాంటివేమీ వుండవు. దైవం కేవలం తన ఎదురుగా ఉండే 'దీపారాధన' వెలుగులో మాత్రమే కనిపిస్తుంటుంది.
 
గర్భాలయం పైన గల విమానం ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విమానంపై ఒక కలశం మాత్రమే ఉంచుతారు. రాగితో చేయబడిన ఈ కలశం బంగారు పూతను కలిగి ఉంటుంది. 
 
నవగ్రహాలు, 27 నక్షత్రాల నుంచి వచ్చే శక్తివంతమైన కిరణాలను ఈ కలశం గ్రహించి శక్తిని గర్భాలయంలో ఉన్న యంత్రములనబడే రాగిరేకులకు చేరవేస్తుంది. 
 
అప్పుడు ఆ శక్తిని వాటి నుండి విగ్రహం గ్రహిస్తుంది. దేవాలయానికి వెళ్లి అక్కడి దైవాన్ని దర్శించినప్పుడు ఈ శక్తి సహజంగానే భక్తుల దేహంపై ప్రభావం చూపి ఆరోగ్యాన్నిస్తుంది.
 
గర్భాలయం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది కనుకనే ఆ శక్తి అన్ని దిక్కులకు వెళ్లకుండా ఒక వైపుకు మాత్రమే వెళ్లాలని 'ఆగమ శాస్త్రం'చెబుతోంది. 
 
ఈ కారణంగానే గర్భాలయానికి కిటికీలు కూడా లేకుండా, ఒకే ఒక ద్వారం మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఆ వైపు నుంచి మాత్రమే భక్తులు దైవాన్ని దర్శించి ఆయన నుంచి తమకి కావలసిన శక్తిని పొందుతుంటారు.
 
తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. 
 
అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడి వైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. 
 
శ్రీ వైకుంఠం నుండి లక్ష్మీ దేవిని వెతుకుతూ వచ్చిన శ్రీనివాసుడు ఇక్కడ అద్భుత సాలగ్రామ శిలలో స్వయం వ్యక్త మూర్తిగా ఆవిర్భవించి ఆరాధింప బడుతున్నాడు.
 
వారి గర్భాలయం శక్తి నిలయం. స్వయంభువుగా వెలసిన మహావిష్ణువును సేవించాలని ఎందరో దేవతలు గర్భాలయాన్ని ఆశ్రయించి ఉంటారు. 
 
వారందరి మహత్యంతో గర్భాలయం శక్తివంతమైన వలయంగా ఉంటుంది స్వస్తి ...
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
 

బలిపీఠం...సకలభూత నైవేద్యపీఠం 

ఆలయం ఆగమం....!!

 
ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. 
 
గర్భగుడి, విమానం, విగ్రహం (మూలమూర్తి), బలిపీఠం ఇవి నాలుగూ ఉంటేనే దాన్ని దేవాలయం అంటారు.
 
 కనుక ఆలయంలో బలిపీఠం ప్రముఖమైనది. ఆలయంలోని మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించాక చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు. 
 
గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి.
 
 బలిప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది.  ప్రాచీన దేవాలయాలలోని బలిపీఠాలు ఇంత కళాత్మకంగా ఉండవు. మొరటు రాతిస్తంభం వలె ఉండేవి.
శిల్పరత్నం మట్టితో, కొయ్యతో కూడా బలిపీఠాలు నిర్మించవచ్చని చెప్పింది.
 
 విష్ణుతిలక సంహిత, మానసార శిల్పశాస్త్రం గ్రంథాలు గోపురం బయట, లేక మొదటి ప్రాకారానికి బయట బలిపీఠాన్ని నిర్మించాలని చెప్పాయి.
 
 తిరుమల, దారాసురం వంటి ఆలయాలలో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది.గర్భగుడిపై ఉన్న విమానం, గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది.
 
 విమానం ముకుళితపద్మం (ముడుచుకుని ఉన్న తామర) వలె ఉంటే బలిపీఠం వికసితపద్మం (విరిసిన కమలం) వలె ఉంటుంది.
 
 దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే, బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది. 
 
ఆలయపురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది. కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి.
 
ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. 
 
ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు. 
 
తిరుమల ఆలయం చుట్టూ వీటిని మనం చూడవచ్చు. శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు.
 
 ఇందులో శివుడు సదా ఉంటాడని, బలిపీఠాన్ని దర్శించినా శివదర్శనం అయినట్లే అని శైవాగమాలు చెబుతున్నాయి. 
 
ముఖమండపం చేరే ముందు భక్తులు బలిపీఠానికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అహంకారాన్ని బలిగా అక్కడ విడిచి బలిపీఠం నుండి వచ్చే దైవీకశక్తిని తనలో నింపుకుని దైవదర్శనానికి  వెళ్లాలి. 
 
బలిపీఠానికి ప్రదక్షిణ చేసే వీలు లేకపోయినా తాకి నమస్కరించవచ్చు. బలి వేసిన  అన్నం ఆయా దేవతలకు మాత్రమే.
 
 మానవులు దాన్ని భుజించకూడదు.బలిపీఠ దర్శనంతో మానవులలోని సమస్త దుర్గుణాలు తొలగిపోతాయి.
 

దేవాలయానికి వెళ్ళినపుడు ఘంట మూడు సార్లే  ఎందుకు కొట్టాలి. తెలుసా ?

 
శ్లోకము :
 
ఏకతాడే మరణం చైవ
ద్వితాడే వ్యాధి పీడనం !
త్రితాడే సుఖమాప్నోతి  తత్ఘంటానాదలక్షణం ! ! 
 
భావం : దేవుని ముందర ఘంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం .
 
రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాము . '
 
మూడుసార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు , మనస్సుకు సుఖము కలుగుతుంది. 
 
ఈ పద్దతిని  దేవాలయ ఘంటా నాద లక్షణము గా శాస్త్రం చెప్పబడింది .
 
( దేవాలయంలో ఘంటానాదం ద్వారా జనించే ఓంకార ధ్వని తరంగాలను మన చెవుల ద్వారా శరీరంలోకి శబ్ద తరంగాలకు అనుసంధానం చేయండి తద్వారా మానసిక ప్రశాంతతను పొందండి ).